హైదరాబాద్

రైతులకు సకాలంలో రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: రైతులకు సకాలంలో రుణాలు అందజేసేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అధికారులను రంగారెడ్డి కలెక్టర్ ఎం.రఘునందన్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో బ్యాంకర్ల సమావేశం జరిగింది. బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించాలని తెలిపారు. ఖరీఫ్, రబీలో కొత్తగా ఇవ్వాల్సిన లక్ష్యాలతో పాటు రినివల్స్‌కు సంబంధించి వివరాలను బ్యాంకర్లు బ్రాంచీల వారీగా గురువారంలోగా నివేదికలను అందజేయాలని సూచించారు. రుణాలు ఇవ్వడంలో పారదర్శకతను పాటించాలని బ్యాంకర్లకు చెప్పారు. రుణాల రికవరీ విషయంలో ఏపీఎంలు శ్రద్ద వహించాలని, బ్యాంకు మేనేజర్లకు రికవరీ చేస్తామనే నమ్మకం కలగాలని సూచించారు. 2018-19 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్, ఆర్‌బీఐ ఏజీఎం ఉష, నాబార్డ్ మేనేజర్ రాజగోపాలన్, ఏజీఎంలు దుర్గాప్రసాద్ రావు, నాగరాజు పాల్గొన్నారు.
టీఎస్-వెదర్ యాప్
గోడ పత్రిక ఆవిష్కరణ
వాతావరణ సమాచారాన్ని ఇక నుంచి సెల్‌ఫోన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ నూతన మొబైల్ యాప్‌ను (టీఎస్-వెదర్) అందుబాటులోకి తీసుకువచ్చిందని రంగారెడ్డి కలెక్టర్ ఎం.రఘునందన్ రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో టీఎస్-వెదర్ యాప్‌కు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. టీఎస్‌డీపీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న 863 వాతావరణ కేంద్రాల సహకారంతో ఈ యాప్‌ను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి ఆటోమేటిక్ ఆండ్రారుూడ్ ఆపరేచింగ్ సిస్టమ్ కలిగి ఉన్న మొబైల్ పోర్టల్‌లో గూగుల్ ప్లే స్టోర్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలుసుకోవచ్చని చెప్పారు. జెడ్‌పీ సీఈఓ రాజేశ్వర్ రెడ్డి, డీఆర్‌డీఓ ప్రశాంత్ కుమార్, సీపీఓ మోహన్ రెడ్డి, సీఓ సైదిరెడ్డి, ఎస్‌ఓ శే్వత, డీపీఓ పద్మజా రెడ్డి పాల్గొన్నారు.

పూజల పేరుతో మోసాలు
నకిలీ బాబా అరెస్టు
రెండు కేజీల బంగారం స్వాధీనం
గచ్చిబౌలి, జూలై 13: పూజలు చేస్తే బంగారం రెట్టింపు అవుతుంది.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.. మానసిక ప్రశాంతత చేకురుతుంది. సమస్య ఏదైన పూజలు చేసి వాటిని దూరం చేస్తామని శాటిలైట్ ఛానల్స్ ప్రకటనలు గుపించాడు. యజ్ఞం, హోమం, పూజలు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ బాబాను అతనికి సహకరించిన భార్యని బాలనగర్, శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ బాబా నుంచి సుమారు రెండు కేజీల బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను కమిషనర్ సజ్జనార్ వివరించారు. కేరళకు చెందిన శివాహోమ్ రామశివనుజం (37).. 1998లో స్వామీజీగా మారారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, వారణాసి, అమరావతి పదితర ప్రాంతాలను సందర్శించారు. 2009లో స్వామీజీ శివహోమ్ తేజస్విని వివాహం చేసుకుని హైదరాబాద్‌కు మాకాం మార్చి యుసుఫ్‌గూడలో తత్వాపితం ఆశ్రమం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక బోధనలతో ప్రలను ఆకర్శించాడు. పూజలు చేస్తే కోటీశ్వరులు అవుతారని నమ్మించి అనేక మందిని మోసం చేశారు. ఇంద్రా సినిమాలో బ్రహ్మనందం బృందం మాదిరిగా భార్యాభర్తలు వెండి కలశాల్లో బంగారం ఆభరణలు పెట్టి పూజ చేస్తే గడువు తరువాత తామే వచ్చి స్వయంగా తేరిచి తీస్తామని నమ్మించేవారు. పూజ చేయాడానికి కావల్సి రెండు కలశాలను భార్యభర్తలే షాపు నుంచి తీసుకొచ్చేవారు. పూజ చేసిన స్వామి చెప్పిన సమయం పూర్తి కావడంతో కలాశాలను తెరిచి చూస్తే అందులో రాళ్లు, ఇసుక దర్శనం ఇవ్వడంతో మోసపోయామని పోలీసులను బాధితులు ఆశ్రయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 మంది వరకు తమకు ఫిర్యాదు చేసినట్లు సీపీ తెలిపారు. మరో మారు పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తామని వివరించారు. దొంగ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైన బాధితులు ఉంటే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ చెప్పారు. భార్య తేజస్విని.. బాబా మోసం చేసి తెచ్చిన బంగారాన్ని ప్రైవేటు ఫ్రైనాన్స్ సంస్థలకు, బయట వ్యక్తులకు విక్రయించేదని సీపీ వివరించారు. భార్యాభర్తలను అరెస్టు చేసి వీరి నుంచి సుమారు 1922 గ్రాముల బంగారం, మహేంద్ర ఎక్స్‌యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ పద్మజా రెడ్డి, క్రై ఏడీసీ దయానంద్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ పగడాల అశోక్ పాల్గొన్నారు.