హైదరాబాద్

ప్రణాళికా లోపంతో పట్టణాల్లో వరదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: నగరాల్లో వేగంగా వస్తున్న పట్టణీకరణ, అభివృద్ధి ప్రణాళికలో లోపం, ఎప్పటికపుడు పెరుగుతున్న జనాభా వంటి కారణాలతోనే పట్టణాల్లో వరదలు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అభిప్రాయపడ్డారు. దీనికి తోడు చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికావటం కూడా ఓ ప్రధాన కారణమని ఆయన చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ‘అర్బన్ ఫ్లడింగ్’ అంశంపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన రామకృష్ణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం విపత్తుల సమయాల్లో మాత్రమే వాటి నివారణ చర్యలపై చర్చ జరుగుతుందని అన్నారు. అర్బన్ ఫ్లడింగ్‌తో పాటు అన్ని రకాల విపత్తులకు శాశ్వత పరిష్కార మార్గాలను చేపట్టాలని సూచించారు. ఇందుకుగాను భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాధాన్యతల వారీగా ఈ పనులను చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో నాలాల వెంట 28వేల ఆక్రమణలున్నాయని, వీటిని తొలగించాలంటే సామాజిక, ఆర్థిక, శాంతిభద్రతల కోణాల్లో నుంచి చూడాల్సి ఉందని అన్నారు. నాలాలపై అత్యంత కీలకంగా ఉన్న 47 అవరోధాలను రూ. 230 కోట్ల వ్యయంతో తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నాలా ఆక్రమణలను తొలగించి విస్తరించటంలో భాగంగా చేపట్టిన చర్యల్లో భాగంగా తొలగించిన నివాసాలకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. 400 ఏళ్ల పైచిలుకు చరిత్ర కల్గిన నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలు ఓ ప్రధాన సమస్యగా మారాయని వెల్లడించారు. గతంలో చెరువుగా ఉన్న ఏనుగుల కుంటను వెంగళరావు పార్కుగా రూపొందించటంలో వర్షపు నీటి నిల్వకు ఆస్కారం లేకుండా ఉండి, పంజాగుట్ట మోడల్ హౌజ్ వద్ద చిన్నపాటి వర్షానికే రోడ్డు జలమయం అవుతుందని తెలిపారు. నగరంలో అర్బన్ ఫ్లడింగ్ అంశంపై ముంబై ఐఐటీ ప్రొఫెసర్ కపిల్ గుప్తా ప్రసంగించిన ఈ కార్యక్రమంలో భారత వాతావరణ శాఖ డైరెక్టర్ డా.వై.కే.రెడ్డి తదితరులు నివేదిక పత్రాలను సమర్పించారు.

‘మేము’ సైతం
* బల్దియా విధుల్లో పౌరుల భాగస్వామ్యం
* నేటి నుంచి అమలు కానున్న ‘ఇంటర్న్‌షిప్’
హైదరాబాద్, జూలై 13: జీహెచ్‌ఎంసీ నిర్వహించే పలు అత్యవసర సేవల నిర్వాహణతోపాటు ఇతర కార్యక్రమాల్లో నేటి నుంచి నగర పౌరుల భాగస్వామ్యం పెరగనుంది. జీహెచ్‌ఎంసీ ఆహ్వానం మేరకు ఇప్పటికే వందలాది మంది నగర పౌరులు తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంటర్న్‌షిప్ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కమిషనర్ జనార్దన్ రెడ్డి నేడు గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారి శాంతి సరోవర్ భవన్‌లో శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ చేపట్టే పారిశుద్ద్య కార్యక్రమాలు, తడి, పొడి చెత్త వేరుచేయటం, ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నిర్వాహణ, జవహర్‌నగర్ డంపింగ్ యార్డు, చెరువుల శుద్ధి, ప్లాస్టిక్ నిషేధం అమలు, నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు త్వరలో నిర్వహించనున్న మరో దఫా హరితహారం వంటి కార్యక్రమాల్లో 18 ఏళ్లు దాటిన నగరానికి చెందిన ప్రతి పౌరుడు ఈ ‘ఇంటర్న్‌షిప్’ కార్యక్రమంలో నేరుగా పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే వివరాలను నమోదు చేసుకున్న పౌరులంతా ప్రతి శని, ఆదివారం రోజుల్లో ఐదు గంటలపాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. నగరాన్ని మరింత శుభ్రమైన, ఆహ్లాదకరంగా, ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని, వారిలో అవగాహనను, బాధ్యతను పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే పలు కార్పొరేట్, ప్రభుత్వ సంస్థలకు చెందిన ఉద్యోగులు కూడా ముందుకొచ్చారు. తొలి దశగా అమలయ్యే ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన, తడి, పొడి చెత్తను వేరు చేయటం, 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్ కవర్ల నిషేధం, జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిశీలన చెరువుల పునరుద్ధరణ, హరితహారంలో భాగంగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమంలో వీరంతా భాగస్వాములు కావల్సి ఉంటుందని అధికారులు సూచించారు. జీహెచ్‌ఎంసీలో శిక్షణ పొంది, చక్కటి భాగస్వామ్యం అందించే వారిని గుర్తించి, వారికి సర్ట్ఫికెట్లను అందజేయనున్నారు. రొటీన్ పౌరసేవల నిర్వహణ, ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వారిని హరితహారం, స్వచ్ఛ కార్యక్రమాల్లో ఉపయోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.