హైదరాబాద్

సీసీరోడ్ల నిర్మాణానికి రూ. 45.60లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూలై 14: మట్టిరోడ్లను సీసీరోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం రూ. 45.60లక్షలు మంజూరు చేసిందని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని చటాన్‌పల్లి, సోలీపూర్ గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీరోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. చటాన్‌పల్లి, సోలీపూర్ గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటింటికి నల్లా కనెక్షన్ వంటి వౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పురపాలక సంఘంలో సీసీరోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో బీటీరోడ్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుబీమా పథకానికి అర్హులైన ప్రతి రైతు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ అగ్గనూరి విశ్వం, కమీషనర్ శరత్‌చంద్ర, కౌన్సిలర్లు కృష్ణవేణి, యుగందర్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్, నేతలు పాండురంగా రెడ్డి, సత్యనారాయణ యాదవ్, వీరాంజనేయులు, వెంకటేష్ గౌడ్, సుదర్శన్, జంగయ్య, అశోక్ యాదవ్, అశోక్ ముదిరాజ్, శ్రీకాంత్, రాజశేఖర్ పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
కేపీహెచ్‌బీకాలనీ, జూలై 14 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భాధితులకు అందజేశారు. పాపిరెడ్డినగర్‌కు చెందిన సూర్యతేజశ్రీ కి లక్ష 50 వేలు, వినాయక్‌నగర్‌కు చెందిన నాగభూషణానికి రూ.60 వేలు, నల్లగుండ్లకు చెందిన నరేందర్‌రెడ్డి రూ.60 వేలు, సాయినగర్‌కు చెందిన శంకర్‌గౌడ్ రూ.40వేల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి అప్పన్న హస్తంలా ఆదుకుంటుందన్నారు. అర్హూలైన వారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.