రంగారెడ్డి

పారిశ్రామిక వ్యర్ధాలపై నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్ధాలపై కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నగర శివారుల్లో నెలకొల్పిన భారీ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వ్యర్ధాలను ఎదేచ్ఛగా నాలాల్లోకి తరలిస్తుండటంతో కాలుష్యానికి కారణం అవుతున్నాయి. రాజధాని శివారు ప్రాంతాల్లో నెలకొల్పిన పరిశ్రమల్లో ఫార్మా కంపెనీలతో పాటు అనేక రకాల కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి. ఉత్పత్తిలో భాగంగా ఆయా పరిశ్రమల నుంచి ప్రమాధకరమైన ఉద్గారాలు కలిగిన వ్యర్ధాలు వెలువడుతుంటాయి. నిబంధనల ప్రకారం వీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన అనంతరమే బయటకు వదలాల్సి ఉంటుంది. అయితే కొన్ని కంపెనీలు వాటిని నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయకుండానే నేరుగా వ్యర్ధాలను బయటకు వదిలివేస్తున్నాయి. ఇందు కోసం ఆయా సంస్థలు అక్రమంగా పైప్‌లైన్‌లను నిర్మించి నాలాల్లోకి కలిపేస్తున్నారు. తనిఖీల సమయలో అధికారుల ఎలాంటి అనుమానం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను సైతం చేసుకుంటున్నారు. ఇక ఘన వ్యర్ధాలను రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ప్రత్యేక వాహనాల్లో ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. ప్రాణాలను హరించే విష వాయువులను సైతం నేరుగా వాతావరణంలోకి వదిలివేస్తున్నట్టు పలు మార్లు నిర్వహించిన తనిఖీల్లో బహిర్గతం అయింది. నగరంలో నిత్యం లక్షలాది వాహనాలు సంచరిస్తుండటంతో కాలుష్యంతో నిండిపోతుండగా పరిశ్రమల నుంచి అక్రమంగా గాలిలో కలుస్తున్న వాయివుల ద్వారా మరింత ప్రమాదం ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పీసీబీ తనిఖీలకు సాంకేతికతను జోడించింది. సిబ్బంది కొరత ఇతర కారణాలతో పీసీబీ గతంలో అలసత్వం వహించినా ప్రభుత్వ ఆదేశాలతో మెల్కొంది. ఇటీవలే నియమితులైన అధికారులకు శాస్తవ్రేత్తలు, సీనియర్ ఉద్యోగులచే సాంకేతిక అంశాలపై శిక్షణ కల్పిస్తోంది. తనిఖీలకు వెళ్లినప్పుడు సాంపిల్స్‌ను సేకరించే విధానంతో పాటు వాటిని పరీక్షించే విధానాలపై శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమ వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక బృందాల తనిఖీలు నిర్వహిస్తూ ప్రమాణాలు పాటించని సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవలే జిడిమెట్ల పారిశ్రామిక వాడలో అక్రమంగా పైప్‌లైన్లు నిర్మించి విషపూరితమైన నీటిని స్థానికంగా ఉండే చెరువులోకి తరలిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు నాలుగు రోజుల పాటు తవ్వకాలు జరిపి వాటిని నిర్ధారించి ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసి అనంతరం పూర్తిస్థాయిలో లెసెన్స్‌లు రద్దు చేశారు. పరిశ్రమల యజమానులు భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు పీసీబీకి నిబందనలు పాటించాలని కోరుతున్నారు.