హైదరాబాద్

లష్కర్ ఘటాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి దేవాలయ అనువంశిక ధర్మకర్తల మండలి కుటుంబీకులు ఒడిబియ్యం, తొలి పసుపు, కుంకుమ సమర్పించారు. దేవాలయ వ్యవస్థాపకులు సురిటి అప్పయ్య ముదిరాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ముదిరాజ్ కులస్థులు పెద్దఎత్తున హాజరై అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు కుంకుమ సమర్పించారు. వందలాది మంది భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవా సమితి చైర్మన్ పిట్ల నగేష్ మాట్లాడుతూ, అమ్మవారి దేవాలయం స్థాపించి 200 సంవత్సరాలు పూర్తయినట్లు తెలిపారు. ముదిరాజ్ వంశీకులు.. దేవాలయాన్ని స్థాపించి అమ్మవారికి సేవలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సురిటి కృష్ణ, సమితి ప్రెసిడెంట్ కామేష్, ఏలూరు నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చైర్మన్ యాదగిరి ముదిరాజ్, కార్పొరేట్లు గరిక శ్రీదేవి, పులి జగన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు అందె బాబు, గజ్జల నాగేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. మహంకాళి ఘటాల అలంకారం కోసం దేవాలయం నుంచి కర్బల మైదానం నల్లపోచమ్మ ఆలయం వరకు ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివెళ్లారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ఘటాల ఊరేగింపును ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ అరుణ గౌడ్, ఆలయ ఈఓ అన్నపూర్ణ పాల్గొన్నారు.
ప్లాస్టిక్ నిషేదం
ర్యాలీలో యాక్షన్ రీసెర్చ్ ఇంటిగ్రెటీ ఫర్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ప్లాస్టిక్ నిషేధించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. జాతరలో పాల్గొనే లక్షలాది మంది భక్తులకు ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన కల్పిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు పిట్ల నగేష్ తెలిపారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నగరంలో ప్లాస్టిక్ నిషేధానికి తమ వంతు కృషి చేస్తామని, ప్రజాప్రతినిధులు ఫ్లెక్సీలు పెట్టకుండా పర్యావరణ హితానికి పాటుపడాలని కోరారు.
కోలాహలంగా అమ్మవారికి బోనం
సికింద్రాబాద్, ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఆషాడ మాసం మొదలవగానే ప్రారంభమైంది. ఆదివారం అమ్మవారికి ఉజ్జయినీ మహంకాళి, మాణిక్యాలమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో మొదటి బోనం సమర్పించడంతోపాటు ఫలహారబండి ఊరేగింపు నిర్వహించి జోగిని వైష్ణవి అమ్మవారికి బోనం సమర్పించారు. బోనం తలపై పెట్టుకుని డప్పుల దరువులకు నృత్యాలు చేస్తూ కోలాహలంగా అమ్మవారికి బోనం సమర్పించారు. వందలాదిమంది భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారికి ఇష్టమైన ఫలహారాన్ని బండిలో పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ నాయకులు గౌరీశంకర్, కార్పొరేటర్ అత్తెల్లి అరుణ గౌడ్, నేతలు మల్లికార్జున్ గౌడ్, శీలం ప్రభాకర్, భవర్‌లాల్ వర్మ, గజ్జుబాయి కొలారియ, గజ్జల నాగేష్, సమితి అధ్యక్షుడు మహేష్ కటారి, రమణ, మోహన్, ప్రవీణ్ యాదవ్, రాజు శ్రీను, సూరజ్, వీరేష్ పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేసారు. బోనం సమర్పణలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పాల్గొని స్టెప్పులు వేస్తూ సందడి చేసారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.