హైదరాబాద్

ప్రశాంతంగా విధి నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కుటుంబంలో ప్రశాంతత ఉంటేనే అంకిత భావంతో విధులను నిర్వహించడం సాధ్యపడుతుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. విధి నిర్వహణ ఎంత ముఖ్యమో కుటుంబంలో సంతోషం అంతే ముఖ్యమని చెప్పారు. ఆదివారం నాడిక్కడ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన పోలీసు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సిపి ప్రసంగించారు.
కుటుంబ సమేతంగా విచ్చేసిన పోలీసు సిబ్బందితో కలిసి సిపి అంజనీకుమార్ ఉల్లాసంగా గడిపారు. వారి పిల్లలు ఎలా చదువుతున్నారు, కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పిల్లలను గొప్పవాళ్లుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కుటుంబం ఉంటే విధి నిర్వహణలో అంతా ప్రశాంతంగా ఉంటుందని, ఇందుకు గృహిణులు సైతం తమ వంతు బాధ్యత వహించాలని అన్నారు. ఈ సందర్భంగా పోలీసు కుటుంబాల పిల్లలు, మహిళలు పాటలు పాడడం, డ్యాన్సింగ్, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ వంటి పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వెస్ట్‌జోన్ ఇన్‌చార్జి డిసిపి విశ్వప్రసాద్, అదనపు డిసిపి ఎం.వెంకటేశ్వర్లు, పంజాగుట్ట ఎసిపి ఎ.విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు. వివిధ రకాల వంటలతో ఏర్పాటు చేసిన విందు భోజనం అంతా ఆరగించారు. సుమారు 550 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.