హైదరాబాద్

మెట్రోరైల్‌లో గవర్నర్ దంపతుల ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గవర్నర్ నర్సింహన్ దంపతులు ఆదివారం మెట్రోలో ఆకస్మికంగా ప్రయాణించారు. ఆదివారం ఉదయం గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్ నుంచి నడుచుకుంటూ బేగంపేట మెట్రోస్టేషన్‌కు చేరుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సాధారణ ప్రయాణికుల్లా బేగంపేట నుంచి అమీర్‌పేట చేరుకున్నారు. అక్కడి నుంచి మియాపూర్‌కు బయలుదేరారు. గవర్నర్ దంపతులను గమనించిన మెట్రో సిబ్బంది విషయాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి తెలియజేశారు. కూకట్‌పల్లి స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న రెడ్డి హుటాహుటిన మియాపూర్‌కు చేరుకొని వారికి స్వాగతం పలికారు. గవర్నర్ రాకను గమనించిన హడావుడి చేస్తున్న అధికారులకు ఇతర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని ఆయన సూచించారు. కొద్దిసేపు మియాపూర్ స్టేషన్‌లోనేసౌకర్యాలను పరిశీలించారు. మియాపూర్ ఆర్ట్ సెంటర్‌తో పాటు వాటర్‌లెస్ మూత్రశాలలను పరిశీలించారు. మెట్రో ప్రయాణం, స్టేషన్లలోని సౌకార్యాలు బాగున్నాయని ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ సంస్థలను అభినందించారు. తిరిగి మియాపూర్ నుంచి అమీర్‌పేటకు అక్కడి నుంచి బేగంపేటకు చేరుకున్నారు. మెట్రోలో ప్రయాణం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. గవర్నర్ దంపతుల ఆకస్మిక ప్రయాణ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఉరుకులు పరుగులు తీశారు.

నగరంలో వాహనాలు 50లక్షలు
నలుమూలలా పెరిగిన ట్రాఫిక్ ఇబ్బంది * నగర శివారుల్లో నాలుగు బస్ టెర్మినళు ల టీఎస్‌ఆర్టీసి యోచన

హైదరాబాద్, జూలై 15: నగరంలో అన్ని రకాల వాహనాలు కలిపి 50 లక్షలకు పైగా ఉంటే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, వెళ్లే వాహనాలు వేలల్లో ఉంటున్నాయి. దీంతో హైదరాబాద్ నగరం, శివారులు కలిపి సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం భారీగా విస్తరణ జరిగింది. ప్రస్తుతం ఉన్న వాహనాలు, జనాభా పరిశీలిస్తే ప్రతి ఇద్దరికి ఒక వాహనం ఉన్నట్లయ్యింది. ప్రతి ఏటా అభివృద్ధి చెందుతున్న కార్పొరేట్ రంగం, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో నగరంపై జనాభా ఒత్తిడి పెరిగి ట్రాఫిక్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. 2011లోనే నగర విస్తరణలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని ప్రతిపాదనలు చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నగర విస్తరణ, కారిడార్లు ఏర్పాటు, పారిశ్రామిక వాడలను నెలకొల్పడం వంటి కొత్త అంశాలపై దృష్టిసారించిన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నివారణకు ముఖ్యంగా ఆర్టీసి సిటీ బస్సుల నిలుపుదల, నడపడం కోసం కసరత్తు చేసింది. నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తీవ్రతరం కావడంతో నివారించేందుకు టిఎస్‌ఆర్టీసి, హెచ్‌ఎండిఏ సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నాయి. నగర శివారుల్లో నాలుగు చోట్ల సిటీ బస్ టెర్మినళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా హెచ్‌ఎండిఏ స్ధల సేకరణ కూడా చేస్తోంది. మియాపూర్, శంషాబాద్, శామీర్‌పేట్, హయత్‌నగర్ ప్రాంతాల్లో బస్‌టెర్మినళ్లను ఏర్పాటు చేయడం ద్వారా నగరంపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. మెట్రో రైలు వ్యవస్ధ పూర్తిగా అందుబాటులోకి వచ్చినా సిటీ, సబ్ అర్భన్ బస్సుల్లో రద్దీ తగ్గే అవకాశం లేదని ఇప్పటికే అంచనాకు వచ్చిన ఆర్టీసి నగర శివారుల నుంచి బస్సులను నడిపేందుకు అవసరమైన టెర్మినళ్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటితో పాటు జిల్లాల నుంచి వచ్చే బస్సులను సైతం ఆయా టెర్మినళ్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశంలో ఉంచి, అక్కడి నుంచే నడిపేందుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే మియాపూర్ వద్ద పెద్ద టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నగరం నుంచి కొన్ని శివారు ప్రాంతాలకు ఎంఎంటిఎస్ రైళ్లను, నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలు నడుపుతున్నా ఆర్టీసీ బస్‌లలో ప్రయాణించే వారి శాతం ఏమాత్రం తగ్గడం లేదు. తాజా లెక్కల ప్రకారం 45 నుంచి 50 శాతం మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఎంజిబిఎస్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్ బస్ టెర్మినళ్ల నుంచి ప్రతి రోజు 2.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. సుమారుగా 50 వేల మంది ఒక్కో బస్ టెర్మినల్ నుంచి ప్రయాణిస్తుంటారని, అందుకు అనుగుణంగా వసతుల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. 2014 నాటికి హైదరాబాద్ భాగ్యనగర్ రీజియన్‌లో 20 బస్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని 2011లో జరిగిన సమగ్ర ప్రజా రవాణా సర్వేలో అధికారులు వెల్లడించారు.నగర ట్రాఫిక్ పోలీసుల సూచనలను సైతం నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించారు.