హైదరాబాద్

పనులపై కమిషనర్ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కమిషనర్ జనార్దన్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే జాప్యం జరగటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం అంబర్‌పేట సర్కిల్‌లో పలు రోడ్లను పరిశీలించిన కమిషనర్, ఫ్లైఓవర్ నిర్మాణానికి రోడ్డు విస్తరణ, స్థల సేకరణతో పాటు హరితహారం, శివమ్ ఎదురుగా గల ఏటీఐల బస్ బే నిర్మాణం వంటి పనులను పరిశీలించారు. ఇందులో భాగంగా ఏటీఐ బస్ బే నిర్మాణానికి ఏటీఐ స్థలం ఇచ్చినా, నిర్మాణంలో జాప్యం కావటం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బస్ బే నిర్మాణ స్థలంలో బోరుబావులు ఉండటంతో పనులు చేపట్టడంలో కాస్త జాప్యం జరిగిందని, మరో వారం రోజుల్లో ఈ పనులు ప్రారంభించనున్నట్లు ఇంజనీర్లు కమిషనర్‌కు వివరించారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చేయనున్న రోడ్డు విస్తరణ, స్థల సేకరణ ప్రక్రియపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ మార్గంలో మొత్తం 285 ఆస్తులను సేకరించాల్సి ఉండగా, 175 మంది యజమానులకు ఇందుకు అంగీకరించారని, 130 మందికి నష్టపరిహారం చెక్కులను సిద్దం చేసి పంపిణీ చేయనున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి వివరించారు. వీటిలో 90 ఆస్తులను తొలగించామని వెల్లడించారు. రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీ మార్గంలో సేకరించిన ఆస్తుల తొలగింపులో నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాల్సిందిగా టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌ను సందర్శించి క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. కాసేపు స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు. దెబ్బతిన్న రోడ్లకు వైట్‌మిక్స్‌తో గుంతలను పూడ్చివేయాలని అన్నారు. మరమ్మతు పనులు జరిగే రహదారులపై పనుల వివరాలతో బోర్డులను ప్రదర్శించాలని కమిషనర్ సూచించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు కూడా ఎప్పటికపుడు సమాచారం ఇవ్వాలని సూచించారు.

కామనె్వల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో రాణించిన శ్రీశ్వాన్‌కు సత్కారం
హైదరాబాద్, జూలై 16: ఢిల్లీలో గత నెలలో జరిగిన కామనె్వల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన శ్రీశ్వాన్ అండర్-12 విభాగంలో చక్కటి ప్రతిభను కనపరిచి స్వర్ణ పతకం సాధించాడు. మొత్తం ఏడు రౌండ్‌లపాటు కోనసాగిన ఈ టోర్నీలో శ్రీశ్వాన్ 6.5 పాయింట్లు సాధించి పథమ స్థానంలో నిలిచాడు. సోమవారం శ్రీశ్వాన్ తల్లిదండ్రులతో కలిసి తెంలగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డిని లాల్‌బహదూర్ స్టేడియంలోని తన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా సాట్స్ చైర్మన్ శ్రీశ్వాన్ సత్కరించి అభినందించాడు. ఇప్పటి వరకు శ్రీశ్వాన్ అనేక టోర్నమెంట్‌లలో పాల్గొని పలు పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా సాట్స్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు నగదు పురస్కారాలను అందజేస్తూ ప్రోత్సాహిస్తున్నారన్నారు. శ్రీశ్వాన్ చదువతో పాటు క్రీడల్లో రాణిస్తున్నాడని, చదరంగం క్రీడలో రాణించాలంటే ఎంతో ఏకాగ్రత కావాలని, ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ దేశ, విదేశాలలో మరిన్ని పతకాలు సాధించి దేశానికి, తెలంగాణకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆయన అన్నారు. గ్రాండ్ మాస్టర్ విశ్వనాధ్ ఆనంద్‌ను ఆదర్శంగా తీసుకుని శ్రీశ్వాన్ భవిష్యత్‌లో రాణించాలని సాట్స్ చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలోతెంలగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, సనీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, హాకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ డాక్టర్ కే.నర్సయ్య, శ్రీశ్వాన్ తంత్రి అశోక్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.