హైదరాబాద్

ఆలేరు పెద్దవాగు వద్ద రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలోని పెద్దవాగు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వస్తున్న టవెరా వాహనం అదుపుతప్పి పెద్దవాగు బ్రిడ్జి పైనుంచి ప్రమాదవశాత్తు బోల్తాకొట్టింది. ఈ సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన సాయినాథ్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా ఎనిమిది గాయపడ్డారు. గాయపడిన వారిని భువనగిరి ఏరియా అసుపత్రికి తరలించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఆలేరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
సంక్షేమానికి పెద్దపీట: గాంధీ
కెపిహెచ్‌బి కాలనీ, ఏప్రిల్ 2: బడుగు, బలహీనవర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. శనివారం ఆల్విన్‌కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పిజెఆర్‌నగర్‌లో జిహెచ్‌ఎంసి రూ.10 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకుసాగుతున్నట్టు చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. పిజెఆర్‌నగర్‌లో ప్రజల సౌకర్యార్ధం కమ్యూనిటీ హాల్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కమ్యూనిటీ హాల్‌లో మహిళలు, పొదుపు సంఘాల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, శిక్షణ తరగతులను ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఉంటుందన్నారు. ఈ కమ్యూనిటీ హాల్ నిర్వహణపై స్థానికులు బాధ్యతలు తీసుకోవాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో ఆల్విన్‌కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్, స్థానిక నాయకులు ఆంజనేయులు, లక్ష్మీ, విజయ, దేవి, నర్సింహ్మ, ఏఇ రమేష్, మహదేవ్ పాల్గొన్నారు.