హైదరాబాద్

ఆదర్శంగా లష్కర్ నియోజకవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జూలై 18: సికిందరాబాద్ నియోజకవర్గ అభివృద్ది కోసం నిరంతరం పాటుపడుతున్నామని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. బుధవారం తార్నాక డివిజన్ లాలాపేట్‌లో ఇండోర్ స్టేడియంలో ఓపన్‌జిమ్‌ను ప్రారంభించారు. అడ్డగుట్ట డివిజన్‌లోని బోయబస్తీని ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించారు. బస్తీలో మంచినీటి సదుపాయంతోపాటు, ఇతర వౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను అక్కడికక్కడ ఆదేశించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. గడిచిన యాబై సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గంలో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలోనే ఖర్చుకు వెనుకంజవేయకుండా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. తార్నాక డివిజన్‌లోని గోకుల్‌నగర్‌లోని ప్రభుత్వ స్థలంలో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అందుకు సంబంధించిన ప్రణాళికలను వెంటనే రూపొందించాలన్న మంత్రి ఇప్పటికే పలు డివిజన్‌లలో ఈ తరహా ఫంక్షన్‌హాల్స్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంచినీటి సమస్య తలెత్తకుండా రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టామని అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సమస్య, మంచినీటి సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి సమస్యలు లేకుండా చేశారన్నారు. అంతరించిపోతున్న కులవృత్తులకు జీవం పోస్తూ లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని అన్నారు. సికిందరాబాద్ నియోజకవర్గంలో తాము ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నామని మంత్రి వివరించారు. కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి, ఆలకుంట హరితోపాటు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమీషనర్ రవికుమార్, వాటర్ వర్క్స్ జీఎం సుదర్శన్, తహశీల్దార్ సుగుణ పాల్గొన్నారు.