హైదరాబాద్

ఆదిత్యకు డబుల్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ క్యారమ్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్న టీ.విజయ్‌కృష్ణ స్మారక స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్‌లో వీ-10 క్లబ్‌కు చెందిన ఎస్.ఆదిత్య పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో విజేతగా నిలిచి డబుల్ టైటిల్‌ను సాధించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇటీవల ముగిసిన గ్రాండ్ స్లామ్ ప్రతిష్టాత్మక క్యారమ్ టోర్నీలో విజేతగా నిలిచిన ఆదిత్య 25-16, 25-5 పాయింట్ల తేడాతో ప్రత్యర్థి మాజీ వరల్డ్ చాంపియన్, ఐఓసీఎల్‌కు చెందిన కే.శ్రీనివాస్‌పై ఘనవిజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు జరిగిన సెమీ ఫైనల్లో ఆదిత్య 25-11, 01-25, 20-18 పాయింట్ల తేడాతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఎంఏ.హాకీంపై, శ్రీనివాస్ 25-11, 12-25, 25-10 తేడాతో హెచ్‌ఏంసీసీకి చెందిన మహ్మద్ హమ్మద్‌పై గెలుపొందాడు. మహిళల విభాగంలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో నాసర్ స్కూల్‌కు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థిణి సీ.కార్తీక వర్ష 16-20, 4-24 పాయింట్ల తేడాతో ప్రత్యర్థి ఎల్‌ఐసీకి చెందిన ఎస్.ఆపూర్వ చేతిలో ఓటమి పాలైంది. మహిళల సింగిల్స్‌లో జరిగిన సెమీ ఫైనల్లో ఆపూర్వ 25-0, 25-0 పాయింట్ల తేడతో బీ.సునిత(డీఎల్‌ఆర్‌ఎల్)పై, సీ.కార్తీకేయ వర్ష 25-12, 25-0తో పీ.నిర్మళ(ఎల్‌ఐసీ)పై గెలుపొందింది. జూనియర్ బాలుర విభాగం సింగిల్స్ ఫైనల్లో సీహెచ్.సాయి చరణ్ 25-10, 25-14 స్కోరు తేడాతో ప్రత్యర్థి సయ్యద్ ఆసీఫ్ ఆలీపై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీ ఫైనల్లో సాయిచరణ్ 24-4, 22-18 పాయింట్ల తేడాతో ప్రత్యర్థి సందీప్‌పై, సయ్యద్ ఆసీఫ్ ఆలీ 25-4, 25-6 పాయింట్ల తేడాతో సూర్యపై గెలుపొందాడు. జూనియర్ బాలికల విభాగం జరిగిన సింగిల్స్‌లో ఫైనల్లో సీ.కార్తీకవర్ష 25-0, 25-8 పాయింట్ల తేడాతో ప్రత్యర్థి ఎన్.స్వాతిపై విజయం సాధించి టైటిల్‌ను చేజిక్కించుకుంది. అంతకు ముందు జరిగిన సెమీస్‌లో కార్తీక్ వర్షా 25-0, 25-0 పాయింట్ల తేడాతో చరిష్మ గౌడ్‌పై, ఎన్.స్వాతి 25-1, 25-4 పాయింట్ల తేడాతో కే.నందినీపై గెలుపొందింది.
కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యురాలు, హైదరాబాద్ జిల్లా క్యారమ్ సంఘం అధ్యక్షులు గాద్వాల్ విజయలక్ష్మీ విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్యారమ్ సంఘం అధ్యక్షుడు బీకే హరనాథ్, ప్రధాన కార్యదర్శి మధన్‌రాజ్, హైదరాబాద్ జిల్లా క్యారమ్ సంఘం నిర్వాహణ కార్యదర్శి ఎస్.శోభన్ రాజ్ పాల్గొన్నారు.