హైదరాబాద్

బాలికా సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బాలికా సంరక్షణకు హైదరాబాద్ జిల్లాలో ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ యోగితా రాణా ఆదేశించారు. ఈ ప్రణాళిక క్లస్టర్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అమలయ్యేలా ఉండాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన ‘బేటీ బచావో-బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌డీఓ, యూసీడీ, ఐసీడీఎస్‌లన్నీ బాలికా సంరక్షణకు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. బాధితుల్లో 90 శాతం మంది పిల్లలపై లైంగిక వేధింపులు సమీప బంధువుల ద్వారానే, అమ్మాలయిపైనే గాక, అబ్బాయిలపై కూడా వేధింపులు జరుగుతున్నట్లు వివరించారు. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు ‘్ఫక్సో’ చట్టంపై అవగాహను పెంపొందించాలని సూచించారు. లైంగిక్ వేధింపులు జరుగుతున్నట్లు అన్పించినా, పిల్లలు ఈ విషయాన్ని ఫోన్ 1098కు గానీ, జనం ఉన్న చోట ధైర్యంగా చెప్పుకోవాలని సూచించారు. ఎస్‌పీహెచ్‌ఓ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ గర్భిణులు చెకప్ కోసం సమీపంలోని స్కానింగ్ సెంటర్లకు వెళ్తుంటారని, అక్కడ గర్భస్థ శిశువు లింగనిర్దారణ పరీక్షలు చేసే సెంటర్లను గుర్తించేందుకు నిఘా పెట్టాలని సూచించారు. అంతేగాక, కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఆడ పిల్లలున్న కుటుంబాలపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు.
ఒఒ గర్భస్థ శిశువుపై ఆడ, మగ అంటూ వివక్షత చూపరాదని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి సునంద మాట్లాడుతూ జిల్లాలో 914 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, మూడు నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలకు ప్రీస్కూల్స్ ఉన్నాయని వివరించారు. ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సున్న పిల్లలకు బాలామృతం ఇస్తారని తెలిపారు. గర్భిణులను గుర్తించి ఆరోగ్యలక్ష్మి పథకం కింద వివరాలను నమోదు చేసుకుని, వారికి అన్ని పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ భాస్కరచారి,ప్రాజెక్టు డైరెక్టర్ డీ.సౌజన్య, డిప్యూటీ ఐఓఎస్ ప్రసన్న పాల్గొన్నారు.