హైదరాబాద్

వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వర్షాలు కురుస్తున్న దృష్ట్యా సీజినల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీ.సునితా మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన సాయా సంఘ సమావేశాలకు చైర్ పర్సన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పలు అంశాల పై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసి చెత్తను నిర్ధేశించిన స్థలంలోనే వేసే విధంగా చూడాలని దీన్ని అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని డీపీఓను ఆదేశించారు. గ్రామాల్లో కనీసం వారానికి ఒకసారైనా మురుగు కాల్వలను శుభ్రం చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ దుకాణాల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు గాను చర్యలు తీసుకోవాలని అన్నారు. అంగన్ వాడి, డ్వాక్రా భవనాల సముదాయాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ పై సమీక్షిస్తూ ప్రతి గ్రామంలో మండల తహశీల్దార్ల ద్వారా స్థలాల సేకరణ చేసి డంపింగ్ యార్డుల ఏర్పాటుకు కృషి చేయాలని డీఆర్డీఓకు సూచించారు. మోయినాబాద్ మండలంలో చాలా చోట్ల రహదారి వెంబడి చెత్త పేరుకుపోతుందని తెలుపుతూ ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి చెత్తను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని అందులో భాగంగా పశువులకు, గొర్లకు షెడ్ల నిర్మాణాల నిమిత్తం పెద్దమొత్తంలో డబ్బులు వెచ్చించడం జరుగుతుందని తెలుపుతూ షెడ్ల నిర్మాణాలు నాణ్యతతో నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో వాటర్ షెడ్ల నిర్మాణాలకు చేపట్టే దిశగా గ్రామాలను ఎంపిక చేయాలని అధికారులకు చెప్పారు. పింఛన్‌ల మంజూరీలో జాప్యం జరుగుతుందనే విషయం తన దృష్టికి వచ్చిందని ఇలాంటివి జరగడానికి గల కారణాల పై అధికారులను చైర్ పర్సన్ అడిగి తెలుసుకుని సత్వరమే అలాంటి వారికి పెన్షన్ వచ్చే విధంగా చూడాలని తెలిపారు. రోడ్లు భవనాల శాఖ పై సమీక్షిస్తూ చైర్ పర్సన్ స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వలన రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా అవసరమున్న స్థలాల్లో స్పీడ్ బ్రేకర్‌లు వేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హరిత హారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా పెద్దమొత్తంలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కుషాయిగూడ- ఘట్‌కేసర్ రోడ్డు వెడల్పునకు సభ్యులు చైర్ పర్సన్ దృష్టికి తీసుకురాగా పరిశీలించి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ పై సమీక్షిస్తూ బదిలీల కారణంగా కొన్ని పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడినందున దగ్గరలో ఉండే పాఠశాలల ఉపాధ్యాయుల సేవలను తీసుకుని పాఠశాలలు యథావిధిగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత డీఈవోలకు సూచించారు. ప్రజల అవసరాల మేరకు డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ పీడీ బలరామ్‌కు సభ్యులు సూచించారు. వ్యవసాయ శాఖ పై జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి సమీక్షించారు. సమీక్షా సమావేశంలో జడ్పీ సీఈవో రాజేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.