హైదరాబాద్

ఇక ఆన్‌లైన్‌లోనే అన్ని ఫైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆగస్టు 1వ తేదీ నుంచి జిల్లా యంత్రాంగానికి సంబంధించి అన్ని ఫైళ్లు ఆన్‌లైన్‌లోనే కొనసాగించాలని కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె కల్టేరేట్‌లోని బయోమెట్రిక్ అటెండెన్స్, ల్యాండ్‌బుక్, ఆన్‌లైన్ ఈ-ఆఫీసు సిస్టమ్ అంశాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1వ తేదీ నుంచి పలు సెక్షన్ల ఫైళ్లు ఆన్‌లైన్‌లోనే అనుమతించనున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని దశల వారీగా అన్ని విభాగాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. రెండో దశళో ఆర్డీఓ, తహశిల్దార్, జిల్లా అధికారుల కార్యాలయాలను ఈ ఆఫీసుతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుని, వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేసి, ఫొటోతో పాటు ల్యాండ్ బుక్‌ను అప్‌డేట్ చేసేందుకు, వీఆర్‌ఓలకు ఆదేశాలివ్వాలని డీఆర్‌ఓకు సూచించారు. జిల్లా అధికారుల కార్యాలయాల అధికారులు, ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తున్నామని, బయోమెట్రిక్ హాజరు ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ఎస్‌డీసీ ఏల్‌ఏను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు.