హైదరాబాద్

‘గుంత’ను గుర్తించిన రోజే పూడ్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రోడ్లపై ఏర్పడే గుంతలను గుర్తించిన రోజే పూడ్చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి ఇంజనీర్లు, ఇతర సిబ్బందిని ఆదేశించారు. రోడ్లపై గుంతల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఇటీవల దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ప్రస్తావించిన కమిషనర్ రోడ్లపై గుంతలను ఎప్పటికపుడు పూడ్చేందుకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, అందుకు ప్రత్యామ్నాయంగా వినియోగించాల్సిన క్లాత్, జ్యూట్ బ్యాగ్‌లను ఉపయోగించాలని ప్రచారం చేసేందుకు నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌తో కలిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్‌లో కేవలం రోడ్లపై ఏర్పడే గుంతలను పూడ్చేందుకు దేశంలో ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేయని విధంగా జీహెచ్‌ఎంసీ ఏకంగా 384 బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వర్షాకాలంలోనూ సీసీ రోడ్ల నిర్మాణాలను కొనసాగించాలని ఆదేశించారు. ఈ సంవత్సరం నుంచి నాలాల్లో పూడికతీత పనులను ఏడాది మొత్తం నిరంతరంగా చేపట్టాలని సూచించారు. ఎవరైనా నాలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలను వేస్తే జరిమానాలు విధించాలని ఆదేశించారు. చార్మినార్ జోనల్ కమిషనర్ రవికిరణ్ మాట్లాడుతూ జోన్‌లో ప్రస్తుతం రూ. 38.30 కోట్లతో రోడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, మరో రూ.10.64 కోట్ల పనులకు టెండర్ ప్రక్రియ పురోగతి ఉందని వివరించారు. తమ జోన్ పరిధిలో రోడ్లపై 1370 గుంతలు ఏర్పడినట్లు గుర్తించగా, వీటిలో 1100 గుంతలను పూడ్చామని, మిగిలిన గుంతలను కూడా వెంటనే పూడ్చివేయనున్నట్లు తెలిపారు.