హైదరాబాద్

పతకాలతో తిరిగి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇండోనేషియాలోని జకార్తాలో ఆగస్టులో జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత కబడ్డీ జట్టుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులను శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించి సత్కరించారు. శనివారం సాయంత్రం లాల్‌బహదూర్ స్టేడియంలోని శాట్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భారత కబడ్డీ జట్టుకు ఎంపికైన సిద్దిపేట జిల్లా కబడ్డీ క్రీడాకారుడు గంగాధరి, మల్లేష్‌తో పాటు భారత కబడ్డీ జట్టు కోచ్‌గా ఎంపికైన ఎల్.శ్రీనివాస్ రెడ్డిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భారత్‌లో ప్రస్తుతం క్రికెట్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ కబడ్డీ అని అన్నారు. గ్రామీణ క్రీడగా అవతరించిన కబడ్డీ ప్రస్తుతం వివిధ దేశాలలో అత్యంత ప్రచుర్యాన్ని పొందిందన్నాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి క్రీడలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వడంతో తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్నారని చెప్పారు. ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్టును విజయతీరాలకు చేర్చి బంగారు పతకం సాధించడం ఖాయమని కోచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెంలగాణ కబడ్డీ సంఘం కార్యదర్శి కే.జగదీశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ దక్షిణ మండలం జాతీయ ఖోఖో
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జట్ల గెలుపు
తెంలగాణ ఖోఖో సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైన జూనియర్ దక్షిణ మండలం జాతీయ ఖోఖో చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించాయి. బాలబాలికల కోసం జరుగుతున్న ఈ టోర్నమెంట్‌ను సరూర్‌నగర్‌లోని శాట్స్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.దినకర్‌బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలుర విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఏపీ 14-10 పాయింట్ల తేడాతో తమిళనాడుపై విజయం సాధించి శుభారంభం చేసింది. మరో మ్యాచ్‌లో కర్నాటక 18-17 స్కోరు తేడాతో ప్రత్యర్థి పాండిచ్చేరిపై గెలుపొందింది. తమిళనాడు, కేరళ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 15-15తో డ్రాగా ముగిసింది. బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో కేరళ 14-10తో తమిళనాడుపై, కర్నాటక 11-10తో ఆంధ్రప్రదేశ్‌పై, పాండిచ్చేరి 9-6తో తెంలగాణపై, కేరళ 11-7తో పాండిచ్చేరిపై, తమిళనాడు 11-8తో తెలంగాణపై గెలుపొందింది. ఈ కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు బీ.శాంతికుమార్, తెలంగాణ ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస్ నాయుడు, రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అధికారి ఈ.వెంకటేశ్వర్ రావు, కే.రామకృష్ణ, ఎన్.కృష్ణమూర్తి, కేకేఎఫ్‌ఐ దక్షిణ మండలం కన్వీనర్ జీవీ.పిళ్లై తదితరులు పాల్గొన్నారు.
ఐసీఎస్‌ఈ, ఐఎస్‌ఈ స్కూల్ రీజనల్
స్కేటింగ్ చాంపియన్‌షిప్ ప్రారంభం
అసోసియేషన్ ఆఫ్ ఐసిఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్ ఆధ్వర్యంలో 27వ ఏపీ, తెలంగాణ రీజనల్ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా ప్రథమ స్టేట్ ర్యాంకింగ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ శనివారం ఉదయం ఇందిరా పార్క్‌లోని స్కేటింగ్ రింక్‌లో ప్రారంభమయ్యాయి. చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా నగర అదనపు పోలీస్ కమిషనర్ డీఎస్.చౌహాన్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యుఏ.సుందరి, థెరెసా తదితరులు పాల్గొన్నారు. అండర్-19 బాలుర విభాగంలో నిర్వహించిన క్వాడ్ 300 మీటర్ల పోటీలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్‌కోఠికి చెందిన ఎం.బహుషీరా గమ్యాన్ని 41.80 సెకండ్లలో చేరుకుని స్వర్ణ పతకం గెలుచుకుంది. కాగా, సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌కిచెందిన ఎస్.ఆవినాష్, రాజమండ్రి ఫ్యూచర్ కిడ్స్‌కు చెందిన టీ.శ్రీవాస్తవ ద్వితీయ, తృతియ స్థానాల్లో నిలిచి రజిత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. బాలికల విభాగంలో నిర్వహించిన క్వాడ్ 300 మీటర్ల పోటీలో కింగ్‌కోఠిలోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన రియాక్షీర్ సాగర్, మలక్‌పేట్ సెయింట్ జోసెఫ్‌కు చెందిన సోనాలి తోషివాల్, ఖైరతాబాద్‌లోని నాసర్ బాలికోన్నత పాఠశాలకు చెందిన సయ్యేదా ఆయేషా ఫారీస్‌లు వరుస స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజిత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
మహీన్ నవజ్‌ఖాన్‌కు స్వర్ణం
తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ పర్యవేక్షణలో యునైటెడ్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో కెడెట్ పూమ్ సే వ్యక్తిగత విభాగంలో చక్కటి ప్రతిభను కనపరిచిన మహీన్ నవజ్ ఖాన్ స్వర్ణ పతకం సాధించింది. పాతబస్తీ గంగాపుత్ర సంఘం కమ్యునిటీ హాలులో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో గెలుపొందిన మహీన్ నవజ్‌ఖాన్ తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికైంది.