రంగారెడ్డి

ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ అక్షరాస్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఏప్రిల్ 2: అందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధిద్దామని వయోజన విద్యాశాఖ డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి అన్నారు. సంపూర్ణ అక్షరాస్యతా సాధన దిశగా హబ్సిగూడలోని స్టేట్ రీసోర్స్ సెంటర్‌లో జరుగుతున్న రాష్టస్థ్రాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం రెండవ రోజు కీలకమైన వ్యూహరచన జరిగింది.
శిక్షణ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరి సూచనలను కలుపుకుంటూ రాష్ట్రంలో 2016-17 ఆర్ధిక సంవత్సరంలోనే గుర్తించిన 61లక్షల మంది నిరక్షరాస్యులను రెండు విడతల వారీగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని నెరవేర్చడానికి సమన్వయంతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. అకడమిక్ శిక్షణ, సాంకేతిక సహకారానికి ఎస్‌ఆర్‌సి పూర్తి శక్తియుక్తులను ఉపయోగిస్తుందని ఎస్‌ఆర్‌సి డైరెక్టర్ డాక్టర్ బండి సాయన్న పేర్కొన్నారు. రీసోర్స్ పర్సన్ డాక్టర్ డాక్టర్ పివి సుబ్బారెడ్డి, ప్రొఫెసర్ టి.విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్‌ఐఆర్‌డిలు దృక్పథంలో మార్పే మన విజయానికి పునాది అని, కచ్చితంగా సానుకూల వైఖిరితో మనం ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో శ్రమించిన తీరుగా మళ్లీ కష్టపడే అవకాశం వచ్చిందని తెలిపారు. నిరక్షరాస్యుల సంఖ్య విషయంలో ప్రాథమిక అంచనా పూర్తయిందని, ఇకపై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాలు, మండల స్థాయి, చివరిగా గ్రామాలలో మ్యాచింగ్ బోధన కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులను భాగస్వాములను చేస్తూ సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో తొమ్మిది సాక్షర భారత్ జిల్లాల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, వయోజన విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
జలవనరులు తగ్గితే మానవాళి మనుగడకు ముప్పు

* శాస్తవ్రేత్త డాక్టర్ ఎన్‌హెచ్ రెడ్డి
ఘట్‌కేసర్, ఏప్రిల్ 2: జలవనరులు తగ్గిపోతే ప్రపంచ మానవాళి మనుగడకు ముప్పు తప్పదని కేంద్ర భూగర్భ నీటిమండలి సీనియర్ శాస్తవ్రేత్త డాక్టర్ ఎన్‌హెచ్ రెడ్డి తెలిపారు. మండల పరిధి నారపల్లి గ్రామం విజయపూరి కాలనీలోని రొటేడామ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో శనివారం నీటి కొరత-ప్రపంచ సమస్య అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతు భవిష్యత్ తరాలకు తీరని నీటికొరత రానున్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గొట్టపు బావుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోతున్నట్టు పేర్కొన్నారు. ముందుచూపు లేకపోవటం వల్ల ఈ దుస్థితి ఎదుర్కొనక తప్పదన్నారు.
ఇకనైనా ప్రతిఒక్కరూ మానవ మనుగడకు కంకణబద్ధులై ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుని నీటిని నిలువ చేసుకోవాలన్నారు. నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి మాట్లాడుతు జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటివనరులు పెరగటం లేదని, నీటివినియోగంపై ప్రభుత్వాలు, ప్రజలు పూర్తి అవగాహనతో పనిచేయాలన్నారు. వర్షకాలంలో నీటిని నిలువ చేసుకునేందుకు పూర్వకాలంలో చెరువులను తవ్వించి పరిరక్షించే వారని, నేడు అందుకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. రియల్ వ్యాపారాలతో ఉన్న చెరువులు కాస్తా కనుమరుగు అయినట్లు పేర్కొన్నారు.
నూతనంగా ఇల్లు నిర్మించేవారు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని గతంలో నిభందనలు ప్రవేశపెట్టినప్పటికీ అమలు కాక పోవటం విచారకరమన్నారు. అటవీ ప్రాంతం పూర్తిగా కనుమరుగు అవుతోందని, దింతో వర్షాల జాడ లేకుండా పోయిందన్నారు.
జలవనరులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులుగా మార్చేందుకు తనవంతు కర్తవ్యంగా కృషి చేయాలన్నారు. స్కూల్ చైర్మన్ విజయసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఓయు ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ జి సత్యనారాయణ, జిహెచ్‌ఎంసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి సుధాకర్, ప్రముఖ న్యాయవాది కిషోర్‌రాయ్, ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జి ఎస్ ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.