హైదరాబాద్

ట్రాఫిక్ జామ్‌తో నరక యాతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, ఏప్రిల్ 3: జంటనగరాలలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో రోజురోజుకు పెరుగుతున్న నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంలేదు. గంటల తరబడి రోడ్లపై నిల్చోవలసిన పరిస్థితి దాపురించింది.
ట్రాఫిక్ నియంత్రణకు నగర పోలీసు ట్రాఫిక్ పోలీసు విభాగం ఎన్ని విధాలా ప్రయత్నించినా నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంలేదు. జంటనగరాలతోపాటు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం బేగంపేట. ఈ ప్రాంతాంనుండి ప్రయాణించాలంటే సామాన్య ప్రయాణికునికి నరకం తప్పడంలేదు. బేగంపేట ప్రాంతం వివిఐపి జోన్‌కావడంతో బేగంపేట ఎయిర్‌పోర్టునుండి పలువురు వివిఐపిలతోపాటు ముఖ్యమంత్రులు, గవర్నర్ రాకపోకలు సాగిస్తుంటారు. దీనితో గంటల తరబడి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. నిత్యం ఉదయం, సాయంత్రం ప్యార్‌డైజ్, బేగంపేట, రసూల్‌పురా చౌరస్తా, గ్రీన్‌ల్యాండ్స్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.
బేగంపేట మీదుగా అమీర్‌పేట, బంజారాహిల్స్, గచ్చిబౌలివైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడంలేదు. దీనికి తోడు ఈ ప్రాంతంలో నిర్మాణం చేపడుతున్న మెట్రో రైల్ పనులవలన రోడ్లకు ఇరువైపుల ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. దీనితో ఈ రోడ్లన్నీ ట్రాఫిక్ జాంతో నిలుస్తున్నాయి. ఒక్కసారిగా రోడ్లన్నీ క్రిక్కిరిసి పోవడంతో వాహనదారులు గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. దీనితో బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, మయూర్‌మార్గ్, గ్రీన్‌ల్యాండ్స్ రోడ్లన్నీ పుట్‌పాత్‌ల అక్రమణాలకు గురికావడంతో పాదచారులు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికితోడు రోడ్డుకి ఇరువైపుల అపార్టుమెంట్ నిర్మాణాలు చేపట్టడంతో ఈ ప్రాంతంగుండా వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తప్పడంలేదు. సికిందరాబాద్‌నుండి బేగంపేటమీదుగా వెళ్ళే సాధారణ ప్రయాణికులు కాకుండా ఎక్కువ సంఖ్యలో ట్రాఫిక్ పెరిగిందనవచ్చు. బల్కంపేట. ఫతేనగర్ లింక్‌రోడ్డుగుండా వచ్చే ప్రయాణికులు సైతం ఇదే రూట్‌లో ప్రయాణించాల్సి వస్తుంది. దీనితో బేగంపేట రోడ్డు మొత్తం ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ జామ్ సాధారణమైంది. ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకై స్థానిక ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.