హైదరాబాద్

రండి.. విజయవంతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తగిన చికిత్స, మందులతో పాటు శస్తచ్రికిత్సలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని నగరంలో విజయవంతం సమష్టిగా నిర్వహించి విజయవంతం చేద్దామని కార్పొరేటర్లకు మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లపై మేయర్ గురువారం కార్పొరేటర్లతో టెలీ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలోని 150 వార్డుల్లో, ఒక్కో వార్డుల్లో సుమారు 80వేల మంది జనాభా ఉంటుందని, మొత్తం కలిపి సుమారు కోటి 20లక్షల మందికి ఈ పరీక్షలు నిర్వహించేలా భారీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మొత్తం జనాభాలో ఇరవై శాతం మందికి వివిధ రకాల కంటి సంబంధిత సమస్యలున్నట్లు ఓ అంచనా ఉందని వివరించారు. 24లక్షల మందిలో 53 శాతం అంటే 12.70లక్షల మందికి 25/75 పాయింట్ ఉన్న రీడింగ్ అద్దాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీరిలో పది శాతం అంటే 2.40లక్షల మందికి దృష్టి లోపం ఉన్నట్లు, శిబిరాలకు హాజరైన తర్వాత, వారిని పరీక్షించి, వారికి కంటి అద్దాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మరో 11 శాతం అంటే 2.64లక్షల మందికి ఆపరేషన్లు చేసేందుకు తదుపరి పరీక్షలకు రిఫెర్ చేయనున్నట్లు తెలిపారు. కంటి అద్దాల పంపిణీకి సంబంధించి మంచి శిక్షణ పొందిన వైద్యులు, అప్తాల్మజిస్టులను నియమిస్తున్నట్లు తెలిపారు. ఒక్కోక్కరు రోజుకి కేవలం 35 మందికి పరీక్షలు నిర్వహించాలనే నిబంధనను పెడుతున్నట్లు తెలిపారు. మొత్తం 17.76లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు, రోజుకి 35 చొప్పున 50వేల మాస్‌డేస్ పడుతాయని వివరించారు. వంద వర్కింగ్ డేలు ఉంటే 500 మంది శిక్షణపొందిన డాక్టర్లు, అప్తాల్మజిస్టులు అవరమవుతారని తెలిపారు. ఒక్కో స్క్రీనింగ్ కమిటీలో ముగ్గురు సభ్యులను నియమించనున్నట్లు, వీరిలో ఒకరు కేస్ షీట్ రాసేవారు, మరొకరు డాక్టర్, మిగిలిన మరొకరు కంటి అద్దాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి క్యాంప్‌లో రోజుకి 200 మందికి సంబంధిత స్ట్ఫానర్స్.. ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారని మేయర్ తెలిపారు.