హైదరాబాద్

కుల ప్రాతిపదికపై రాజకీయ నాయకులవ్వాలని ఆశించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: కుల సంఘాల నాయకులు ప్రజలు సేవ చేస్తున్నామంటూ రాజకీయపరంగా టిక్కెట్ ఆశించడం సరికాదని, ప్రజలకు సేవ చేసి ప్రజానాయకులవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిఖ శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలకు సేవ చేసినప్పుడు ప్రజలే గుర్తించి ఓటు వేసి గెలిపిస్తారని, ఒక్కసారి గెలవగానే నాయకులు అయిపోయాం అనికూడా అనుకోవటం పొరపాటే. రెండవసారి ఆ వ్యక్తి ఎన్నికలలో గెలిస్తే అప్పుడు ప్రజల అభిమానాన్ని పొందినట్లు అని ఈటల రాజేందర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ముదిరాజ్ కార్పొరేటర్స్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం ఇందిరా ప్రియదర్శి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ఈటల రాజేందర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ప్రజలకు మనపై ప్రేమా గౌరవం ఉంటే ఓటు వేసి గెలిపిస్తారనే భావం నాయకులలో కలగాలని, రాజకీయాల కోసం వక్రమార్గంలోకి వెళ్లకూడదని ఆయన సూచించారు.
ముదిరాజ్‌లకు మంచిరోజులు వస్తాయని ఎదురు చూడాలి. మిషన్ కాకతీయ ప్రాజెక్టు విజయవంతం అయినట్లయితే తప్పనిసరిగా అందరికీ అవకాశాలు కలుగుతాయని ఈటెల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు పి.లక్ష్మీనారాయణ ముదిరాజ్ అధ్యక్షత వహించగా విజయకుమార్ ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, బండ ప్రకాష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత చిన్నారులు నృత్యాన్ని ప్రదర్శించారు.