క్రైమ్/లీగల్

ఏటీఎంలో భారీ చోరీ రూ.13 లక్షలు దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఆగస్టు 10: ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో భారీ చోరీ జరిగింది. తారానగర్ ఏటీఎం సెంటర్‌లోని రెండు మెషిన్‌లను గ్యాస్ కట్టర్‌ల సహాయంతో తొలగించారు. రూ.13 లక్షలను దోచుకుని షట్టర్ దింపేసి దొంగలు ఉడాయించారు. మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు, క్రైం డీసీపీ జానకీ షర్మిల, మియాపూర్ ఏసీపీ సంక్రాంతి రవికుమార్ పరిశీలించారు. తారానగర్‌లోని బీకే రాఘవ రెడ్డి గార్డెన్స్ సమీపంలోని గిడ్డంగి వద్ద ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం ఉంది. దొంగలు చొరబడి రెండు యంత్రాలను గ్యాస్ కట్టర్‌తో తొలగించారు. వాటిలో ఉన్న దాదాపు రూ.13 లక్షలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుఝామున 3.30 నుంచి 4.15 గంటల మధ్యలో కారులో వచ్చి గ్యాస్ కట్టర్‌తో తొలగించి అనంతరం షట్టర్‌ను కిందకు దింపి వెళ్లిపోయినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. చోరీలో ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి పాల్గొన్నట్టు తెలిసింది. షట్టర్ కిందకు దింపి ఉండడంతో డబ్బులు లేవని ఖాతాదారులు వెనుదిరిగిపోయారు. సాయంత్రం ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన సిబ్బంది గమనించి బ్యాంకు అధికారులకు సమాచారం అందించి చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతి రావు దర్యాప్తు చేస్తున్నారు.