హైదరాబాద్

హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లో గత విధ్వంసక ఘటనలను దృష్టిలో పెట్టుకొని పారాహుషార్ అంటూ పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అన్నింటా పోలీస్ బలగాల మోహరింపులతో హైదరాబాద్‌లో హైఅలర్ట్‌ను ప్రకటించింది.
తనిఖీలు, సోదాలు, కార్డెన్ సెర్చిలతో అనుమానితులపై పోలీసులు జల్లెడ పడుతున్నారు. సోమ, మంగళ వారాల్లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనపై పోలీసులు ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటుచేశారు. 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం కోసం గోల్కొండ వద్ద గట్టి పోలీస్ భద్రతను చేపట్టారు. మావో కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష చేశారు.
ఉగ్రవాదులతో పరిచయాలు పెంచుకోవడంతో పాటు ఆర్థిక వనరులను పెంచుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు ఐసిస్ యువకులను ఆదివారం జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. దీంతో పాతబస్తీలో కొంత అలజడి నెలకొందని పోలీస్‌వర్గాలు అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాతబస్తీలో ఐఎన్‌ఎ సోదాలను ముమ్మరంగా చేపట్టింది. పాతబస్తీలో పోలీస్ బలగాలతో కవాతు చేపట్టాలని, అదనపు బలగాలను సైతం పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. రానున్న రెండు రోజులు జంటనగరాల్లోని అన్ని ప్రాంతాల్లో ప్రజారవాణా కదలికలపై డేగ కన్నుతో రెప్పవాల్చకూడదని నిఘా వర్గాలు హెచ్చరించాయి, ఈనెల 31వ తేదీ వరకు శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులపై నిషేధం ప్రకటించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, సినిమా థియేటర్లు, ప్రధాన ఆలయాలు, ముఖ్యమైన కేఫ్‌ల వద్ద పోలీస్ బలగాలతో తనిఖీలను ముమ్మరం చేసింది. రాహుల్ ఉస్మానియా పర్యటన రద్దు కావడంతో అక్కడ విద్యార్థి సంఘాల మధ్య పరస్పర వాదనలతో వర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉస్మానియాలోకి ప్రవేశించే విద్యార్థులను నిశితంగా పరిశీలించాలని, గుర్తింపు కార్డులు ఉంటేనే అనుమతించాలని ఇటు పోలీసులు, అటు వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి అటూ వర్సిటీ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనపై విద్యార్థి సంఘాలు ఎవరికి వారు నిరసనలకు దిగుతారని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీలోకి వెళ్ళే మార్గాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. జంటనగరాల్లో మూడు రోజులపాటు ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని పోలీస్ అధికారులు నిషేధించారు. వర్సిటీ మార్గాల్లో వెళ్ళే అన్నిరకాల వాహనాల యజమానులు మరో మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రాహుల్ పర్యటన, పంద్రాగస్టును దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా పోలీస్ బలగాలను అప్రమత్తం చేశామని, ఎలాంటి విపత్తులు వచ్చిన ఎదుర్కొంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు.