హైదరాబాద్

రాహుల్ పర్యటనతో కేసీఆర్‌కు వణుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనతో కేసీఆర్‌కు వణుకు పుట్టిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
సరూర్‌నగర్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం మూడు గంటలకు జరుగనున్న విద్యార్థి, నిరుద్యోగ గర్జన బహిరంగ సభ ఏర్పాట్లను పొన్నం ప్రభాకర్, ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి, సాగర్ పరిశీలించారు
. రాహుల్ పర్యటనపై తెలంగాణ ప్రభుత్వం అడుగడునా ఆంక్షలు విధిస్తున్నట్లు ఆరోపించారు. రాహుల్ గాంధీ ఉస్మానియాకు వెళ్లటానికి వీసీ అనుమతులు అవసరమా అని నిలదీశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై గ్రామ పారిశుద్ధ్య కార్మికుల నుంచి దళిత ఐఏఎస్‌ల వరకు ప్రతి ఒక్కరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో సామాన్యులు ఆత్మహత్యలు చేసుకోవటానికి కేసీఆర్, హరీష్ రావులే కారణమని అన్నారు. తెలంగాణ కోసం అమరుడు శ్రీకాంత్ తల్లికి ఎందుకు రాజ్యసభ సీటు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా ముందుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై కృషి చేస్తుంది అన్నారు. నియంతృత్వ మనస్తత్వం కలిగిన కేసీఆర్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసినట్లు తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగ గర్జన బహిరంగ సభకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువతకు నిరాశే మిగిలిందని సిరిసిల్ల రాజయ్య మండిపడ్డారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగన్నర ఏళ్లలో ఒక్క డీఎస్‌సీ నోటిఫికేషన్ కూడా వేయలేదని అన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న విద్యార్థి, నిరుద్యోగ గర్జన బహిరంగసభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌కు చెందిన ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేస్తున్నట్లు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయటానికి ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహేందర్ యాదవ్, దర్పపల్లి రాజశేఖర్ రెడ్డి, బిజ్నపల్లి వెంకటేశ్వ రావు, బద్దుల వెంకటేశ్వ రావు పాల్గొన్నారు.