హైదరాబాద్

పంద్రాగస్టుకు ట్రాఫిక్ ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వేదికైన గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో 15వ తేదీన పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నాం పనె్నండు గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట సాధారణ ట్రాఫిక్ వచ్చే రహదారిని మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యే వారికి ఇప్పటికే ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ క్యాటగిరీలుగా జారీ చేసిన కారు పాస్‌లు కలిగి ఉన్న వారిని మాత్రమే రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వైపు అనుమతించనున్నట్లు తెలిపారు.
పెరేడ్‌గ్రౌండ్స్‌లో..
సికందరాబాద్ పెరేడ్‌గ్రౌండ్స్‌లో కూడా ప్రత్యేకంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నందున టీవోలీ జంక్షన్ బ్రూక్ బౌండ్, ఎన్‌సీసీ జంక్షన్‌ల మీదుగా వచ్చే వాహనాలను ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.