హైదరాబాద్

ఐదంచెల్లో నేత్ర పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని ప్రతి ఒక్కరికి నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, అద్దాల పంపిణీతో పాటు శస్తచ్రికిత్సలు నిర్వహించేందుకు ప్రభుత్వం నేటి నుంచి నిర్వహించనున్న ‘కంటివెలుగు’ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ, జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. అడిక్‌మెట్ డివిజన్ నుంచి మధ్యాహ్నాం మూడు గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో శిబిరంలో రోజుకి 300 మందికి పరీక్షలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కానీ, మొదటి రోజైన బుధవారం కేవలం వంద మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించి, మరుసటి రోజైన 16వ తేదీ నుంచి రోజుకి 300 మందికి పరీక్షలు నిర్వహించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఇప్పటికే నియమించిన 300 కమ్యూనిటీ రిసోర్సు పర్సన్స్ విధులు నిర్వర్తించనున్నారు. ప్రతి ఇంటికి ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేసేందుకు బల్దియా రంగం సిద్దం చేసింది. నగరంలోని 150 వార్డుల్లో మొదటి దశగా గుర్తించిన కమ్యూనిటీ హాళ్లలో శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మేయర్ రామ్మోహన్ వెల్లడించారు. కంటివెలుగు కార్యక్రమ నిర్వాహణ వివరాలను సర్కిళ్ల వారీగా, వార్డుల వారీగా జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.
కంటి వెలుగు కార్యక్రమం కింద ఏర్పాటు చేయనున్న శిబిరాల్లో ఐదు టేబుళ్ల వారీగా ఐదు అంచెలుగా పరీక్షలు నిర్వహించనున్నారు. టేబుల్-1లో ఇద్దరు ఆశా వర్కర్లు వివరాలను నమోదు చేసుకుని, ఆరోగ్య పత్రం జారీ చేస్తారు. టేబుల్-2పై ఆరుగురు ఆశావర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు అన్ ఎయిడెడ్ విజువల్ అక్యుట్ పరీక్షలు నిర్వహిస్తారు. టేబుల్-3లో 3ఏ, 3బీ,3సీ మూడు విభాగాలుగా ఏర్పాటు చేస్తారు. 3ఏలో ఆరోగ్య, కంటి చరిత్ర, 3బీలో కంటి ముందు భాగం పరిశీలన, యాంటీరియర్ సెగ్మెంట్ వైద్య సలహా, రిఫెర్ చేయటం చేస్తారు. 3సీలో మందులను పంపిణీ చేస్తారు. ఇక్కడ వైద్యాధికారి, స్ట్ఫా నర్సుతో పాటు ఓ ఏఎన్‌ఎం విధులు నిర్వర్తిస్తారు. టేబుల్-4లో 4ఏ, 4బీగా ఉంటుంది. 4ఏలో అబ్జెక్టివ్ రిఫ్రాక్టస్ యంత్రంతో దృష్టి పరీక్ష, 4బీలో సబ్జెక్టివ్ రిఫ్రాక్టస్ కటకంతో దృష్టి పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడ ఒక అప్టోమెట్రిస్ట్, సహాయ సిబ్బంది ఉంటారు. టేబుల్-5లో కూడా 5ఏ, 5బీ అనే రెండు విభాగాలుంటాయి. 5ఏలో కళ్ల అద్దాల పంపిణీ లేదా అద్దాల కోసం అభ్యర్థన, 5బీలో సమాచరాం పొందుపర్చటం, కళ్ల అద్దాలతో ఫొటోను దించే పక్రియలు చేపడుతారు. ఇక్కడ ఫార్మసిస్టు, స్ట్ఫా నర్సు, ఏఎన్‌ఎం, హెల్త్‌సూపర్‌వైజర్ ఉంటారు.