హైదరాబాద్

నిర్మాణానికి ముందే వౌలిక వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామంటూ ఇదివరకు పాలకులు నిర్మించిన జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, వాంబే ఇళ్లకు ఎదురైన సమస్యలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ఎదురుకాకుండా జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో వేల సంఖ్యలో ఇళ్లు నిర్మించినా, వాటికి వౌలిక వసతులను కల్పించకపోవటంతో, వాటిల్లో నివాసముండేందుకు లబ్ధిదారులు మందుకు రాకపోవటంతో అవి వృథాగా పడి ఉన్నాయి. ఈ పరిస్థితి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రాకుండా ఉండేందుకు ఇళ్ల నిర్మాణానికి ముందే వౌలిక వసతులను కల్పించే అంశంపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. కాలనీల్లో అంతర్గత వౌలిక సదుపాయాలతో పాటు జాతీయ భవన నిబంధనల ప్రకారం సామాజిక అవసరాలైన స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హాల్, పోస్ట్ఫాసు, బస్ షెల్టరు, పోలీస్‌స్టేషన్, ఫైర్ స్టేషన్ బ్యాంక్, అంతర్గత అవసరాలైన రోడ్లు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ, విద్యుత్ తదితర వాటిని ఇళ్ల నిర్మాణానికి ముందే ఏర్పాటు చేయాలనే మున్సిపల్ మంత్రి కే.తారక రామారావు ఆదేశాల మేరకు కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మంగళవారం అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. డిసెంబర్ నెలాఖరుకల్లా 58 ప్రాంతాల్లోని 40వేల డబుల్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయనున్నట్లు, వచ్చే సంవత్సరం జూన్ కల్లా 51 ప్రాంతాల్లో మరో 60వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేస్తామని వివరించారు. మొత్తం 109 ప్రాంతాల్లో జరుగుతున్న డబుల్ ఇళ్ల కాలనీలో విద్యుత్ సరఫరా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కల్పించాల్సి ఉంటుందని, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 88 కాలనీల్లో తాగునీటి సౌకర్యాన్ని అర్బన్ మిషన్ భగీరథ పథకంలో కల్పించనున్నట్లు తెలిపారు. 88 కాలనీల్లో సీవరైజీ లైన్లను జలమండలి ఏర్పాటు చేయున్నట్లు తెలిపారు.
ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలున్న 28 ప్రాంతాల్లో మిషన్ భగీరథ కింద గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధి బయట ఉన్న కాలనీల్లో అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని హెచ్‌ఎండీఏ చేపట్టాల్సి ఉందని కమిషనర్ వివరించారు. మొత్తం 109 ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలకు సంబంధించి జలమండలి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాలు మాత్రమే రూ.471.45 కోట్ల అంచనాలను సమర్పించాలని, మిగిలిన శాఖలు కూడా వెంటనే కావల్సిన నిధులకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
16న ఉన్నత స్థాయి సమావేశం
నగరంలో వివిధ దశల్లో పురోగతిలో ఉన్న లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతి, వౌలిక సదుపాయాల కల్పన అంశాలపై ఈనెల 16న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత శాఖల క్యారదర్శులు, కమిషనర్లు, విభాగాధిపతులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నట్లు తెలిపారు.