హైదరాబాద్

కాంగ్రెస్ శ్రేణులను ఉర్రూతలూగించిన రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పర్యటన సక్సెస్ అయ్యింది. రాహుల్ పర్యటనలో ఏర్పాట్లలో చిన్ని, చిన్ని పొరపాటు ఉన్నప్పటికీ, మొత్తం మీద రాహుల్ బస్సు యాత్ర విజయవంతమైనందుకు పార్టీ రాష్ట్ర నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఒకవైపు పార్టీ సీనియర్లతో చర్చించడం, మరోవైపు పార్టీ పోలింగ్ కేంద్రాల కమిటీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం పార్టీ కార్యకర్తలకు నూతనోత్తేజాన్ని కలిగించింది. పార్టీ శ్రేణులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సోమవారం మధ్యాహ్నం రాహుల్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే నాయకులు, కార్యకర్తలూ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక బస్సులో అక్కడికి సమీపంలోని క్లాసిక్ కనె్వన్షన్ హాలులో స్వయం సహాయక మహిళా బృందాలతో సమావేశమై, అధికారంలోకి రాగానే అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ సభలో ఏర్పాట్లు సక్రమంగా చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ప్రధానంగా మహిళల సమావేశం అయినప్పటికీ మహిళలతో మాట్లాడించలేదని కొంత మంది మహిళా నాయకులు అభిప్రాయపడ్డారు. అసలు కార్యక్రమం ఏర్పాటులో ముందున్న డి. మాధవరెడ్డిని, సీతక్కను రాహుల్ ఉన్న బస్సు ఎక్కించకపోవడం పట్ల వారి అనుయాయులు కినుక వహించారు. అక్కడి నుంచి రాహుల్ నేరుగా శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. సభ ముగిసిన తర్వాత బేగంపేటలోని హరిత ప్లాజాకు చేరుకుని, రాత్రికి అక్కడే బస చేశారు.మర్నాడు మంగళవారం ఉదయం 9 గంటలకు అన్ని జిల్లాల పోలింగ్ కేంద్ర కమిటీలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందనీ, మీ కష్టాలు తీరుతాయని ఆయన భరోసా ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్, దేశాభివృద్ధి చెందాలంటే కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. కార్యకర్తలు అడిగిన పలు సందేహాలకు, ప్రశ్నలకు రాహుల్ సమాధానలిచ్చారు. తర్వాత ఆయన పార్టీ సీనియర్లతో విడివిడిగా సమావేశమై, వారి అభిప్రాయాలు సేకరించారు. కొంత మందిని త్వరలో ఢిల్లీకి పిలిపించి రూట్ మ్యాప్ ఇస్తానని, మార్గదర్శనం చేస్తానని అన్నారు. మాజీ గవర్నర్ కె. రోశయ్య, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తదితరులు సమావేశమై చర్చించారు.
ఆ తర్వాత హరిత ప్లాజాలో రాహుల్ మీడియాతో గంటకు పైగా సమావేశమయ్యారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఛలోక్తులతో సమాధానలిచ్చారు. మధ్యాహ్నం తాజ్ కృష్ణాతో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తిరిగి హరిత ప్లాజాకు చేరుకుని లంచ్ చేసిన తర్వాత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని అమరులైన వారికి నివాళి అర్పించారు. ఆ తర్వాత సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి, కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
రాహుల్ సరూర్‌నగర్ స్టేడియంకు బయలుదేరినప్పుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కూడా బస్సు ఎక్కారు. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళిన కృష్ణయ్యను కాంగ్రెస్ నాయకులు బస్సు ఎక్కించారు.రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాహుల్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఉత్తమ్ సంతృప్తి..
రాహుల్ రెండు రోజుల పర్యటన సంతృప్తికరంగా జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.