హైదరాబాద్

ఎంజే మార్కెట్‌కు పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిజాంకాలంలో అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన మొజంజాహి మార్కెట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ఎట్టకేలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ చర్యలను వేగవంతం చేసిన ప్రభుత్వం దానికి సమానంగానే ఎం.జే.మార్కెట్‌కు పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రూ. 11కోట్ల వ్యయంతో పనులను చేపట్టింది. అంతేగాక, పనులు సక్రమంగా జరిగేందుకు, సకాలంలో పూర్తి చేసేందుకుగాను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావును ప్రత్యేక పర్యవేక్షణాధికారిగా కూడా నియమించింది. ఈ పనులను మంగళవారం రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరివింద్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేసేందుకుగాను రెండు షిఫ్టుల్లో 40 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు ప్రాజెక్టు పర్యవేక్షణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్మికులకు ఇక్కడే నాలుగు గదుల్లో బస కల్పించినట్లు వివరించారు. అంతేగాక, పనులకు సంబంధించిన సామాగ్రిని ఉంచేందుకు ఒక గోడౌన్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇక్కడున్న షాపులను ఖాళీ చేయకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాణాలను పాటిస్తూ పనులను చేపట్టినట్లు వెల్లడించారు. ఈ పనుల్లో భాగంగా స్కేపింగ్ డోమ్‌ను నిర్మించటంతోపాటు మార్కెట్ చుట్టూ ఎలక్ట్రికల్ డక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చారిత్రక వైభవానికి ప్రతీకగా ఉన్న ఆర్చ్‌కు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్చీపైకి వెళ్లేందుకు వీలుగా ఉన్న మెట్లు, స్టేర్‌కేస్ పనులను చేపట్టినట్లు తెలిపారు. ఆర్‌సీసీ సజ్జలను పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు మార్కెట్ ఆర్చ్ ఇతర ప్రాంతాల్లో పేరుకుపోయిన నాచును తొలగించేందుకు మైక్రో బ్లాస్టింగ్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. నీరు పడినా, ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వాటర్ ప్రూఫింగ్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీకి శ్రీనివాసరావు వివరించారు.