రంగారెడ్డి

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఆగస్టు 15: రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని శాసన మండలి చైర్మన్ కే.స్వామి గౌడ్ కోరారు. రంగారెడ్డి జిల్లా స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వామిగౌడ్ విచ్చేసి పోలీసుల వందనాన్ని స్వీకరించి అనంతరం జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులను పథకాలను వివరించారు. జిల్లా ఏర్పడి నేటికి 40 సంవత్సరాలు అయందని, 1978 ఆగస్టు 15న ఏర్పాడిన రంగారెడ్డి అన్ని రంగాలో అభివృద్ది సాధిస్తు విజయపథంలో ముందుకు సాగుతుందని అన్నారు. జిల్లాలో 191 గ్రామ పంచాయితీలు, ఆరు నూతన మున్సిపాలిటీ ప్రభుత్వం ఏర్పాటు చేశామని అన్నారు. భూరిక్డాలు ప్రక్షాళనను వంద రోజుల్లో విజయవంతంగా పూర్తి చేసి 2లక్షల 42వేల మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపీణీ చేసినట్లు చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా జిల్లాలోని ముచ్చింతల్లో జాతీయ డ్రగ్ కంట్రోల్ అకాడమీ, ఫార్మా కోపియా కమిషన్ కార్యయాల ఏర్పాటుకు 200 కోట్ల రూపాలయను ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు చెప్పారు. 200 మందుల కంపెనీల నుంచి ఏటా 32వేల కోట్ల రూపాల విలువ చేసే ఔషదాలను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి కాన్నుయని వివరించారు. 578 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివిధ శాఖల నుంచి 1393 అనుమతలు ఇచ్చామని రూ.25412 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో పరిశ్రామలు ఏర్పాటు చేయడం వలన 4.64లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.7.70కోట్ల రూపాయలతో జిల్లా పరిధిలోని శాసనసభ్యులకు నివాస క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్డు కులాల చెందిన 378 మంది లబ్ధిదారులకు ఆరు కోట్ల రూపాయల రుణాలను మంజురు చేశామని చెప్పారు. బీసీ సంక్షేమ పథకం కింద 100 మంది లబ్ధిదారులకు రూ.50వేలు చొప్పన అందిచామని, 41694 మంది గొర్రెల కాపరులకు రూ.125 కోట్ల వ్యయంతో 9392 గొర్రెలను పంపిణీ చేశామని వెల్లడించారు. కోకాపేట్‌లో యాదవ కురుమ భవన్‌కు 10 ఎకరాలు, ముదిరాజ్‌ల కోసం ఐదు ఎకరాలు, భసవేశ్వర భవనం కోసం ఒక ఎకరం కేటాయించినట్లు మండలి చైర్మన్ తెలిపారు.
జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సేవా పథకాలు ప్రశంస పత్రాలను స్వామి గౌడ్ అందించారు. జిల్లా వివిధ శాఖలకు చెందిన పథకాలను శకటాల రూపంలో ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సరూర్‌నగర్ ప్రభుత్వ పాఠశాకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన హరితహారం నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన రావు, జాయింట్ కలెక్టర్ హరీష్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.