హైదరాబాద్

పేదరిక నిర్మూలనకే ‘తెలంగాణ సంపద’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 15: తెలంగాణలో సమకూరే సంపద రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పీ.మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పోలీసు మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. పరిపాలనా సౌలభ్యం కొరకు 209 కొత్త గ్రామ పంచాయతీలు, కొడంగల్, పరిగి పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేసి ప్రత్యేకాధికారులను నియమించామని, ప్రతి నెలా 105015 మందికి వివిధ రకాల పింఛన్‌లు చెల్లించేందుకు రూ.12.31 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. తాండూరు, కొడంగల్, దోమ మండలాల్లోని కేజీబీవీలలో ఇంటర్ విద్యను ప్రారంభించామని, బాలికలకు ఆరోగ్య కిట్లను అందించామని, 18733 మంది గర్భిణులను గుర్తించగా, 18681 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేశారని, 7006 మందికి కేసీఆర్ కిట్లను అందజేశారని తెలిపారు. కంటి వెలుగు పథకం ద్వారా 10 లక్షల మందికి కంటి పరీక్షలు చేసేందుకు 22 బృందాలు ఏర్పాటు చేశామని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 717 మంది లబ్దిదారులకు సబ్సిడీతో రూ.8.48 కోట్ల రుణాలిచ్చి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు. షెడ్యూల్డ్ కులాల నిరుపేద వ్యవసాయ కూలీలకు భూపంపిణి పథకం కింద 42 మందికి 77 ఎకరాల భూమిని రూ.4.35 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించామని, 950 మంది వెనుకబడిన తరగతుల లబ్దిదారులకు సబ్సిడీతో రూ.7.34 కోట్ల రుణాలను మంజూరు చేశామని పేర్కొన్నారు. చిరువ్యాపారులకు నూరుశాతం సబ్సిడీతో 50 వేల రూపాయల పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు, తాండూరులో బాల, బాలికలకు వేరువేరులగా మైనారిటీ గురుకుల పాఠశాలలకు 36 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, మైనారిటీ వసతిగృహాల నిర్మాణానికి రూ.4.21 కోట్ల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. జిల్లాలోని సింగల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ఎనిమిది పనులకు రూ.180 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. మనె్నగూడ నుండి రావులపల్లి వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి పనులు, రూ.40 కోట్ల వ్యయంతో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణపనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. మండలాల నుండి జిల్లా ప్రధాన రహదారులను కలిపే ఆరు రోడ్డు పనులు రూ.146 కోట్లతో, 14 వంతెనల నిర్మాణ పనులు రూ.91 కోట్లతో పురోగతిలో ఉన్నాయని, 20 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తూ బీటీ రోడ్లను నిర్మించేందుకు ఆరు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. రూ.50 కోట్లతో చేపట్టిన 1705 అంతర్గత రోడ్లలో 17 పూర్తయ్యాయని మిగతావి పురోగతిలో ఉన్నాయని, నవాబ్‌పేట మండలం ముబారక్‌పూర్, చిట్టిగిద్ద గ్రామాల్లో మూసీనదిపై వంతెనల నిర్మాణానికి రూ.8.40 కోట్ల మంజూరుతో పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్, ఎస్పీ టీ.అన్నపూర్ణ వికారాబాద్, పరిగి శాసనసభ్యులు బీ.సంజీవ రావు, టీ.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.