హైదరాబాద్

18న పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జలమండలి పదవ ఆపరేషన్, మెయింటనెన్స్ డివిజన్ నాగోల్, సాహెబ్‌నగర్‌లోని 1000 ఎంఎం డయా ఎంఎస్ ఇంటర్ కనెక్షన్ పనుల కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి ఇరవై నాలుగు గంటల పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 19వ తేదీ ఆరు గంటల వరకు సరఫరాను నిలివేస్తున్నందున సరూర్‌నగర్ సెక్షన్, ఎల్‌బీనగర్ సెక్షన్, దిల్‌సుఖ్‌నగర్, మారుతీనగర్, అల్కాపురి సెక్షన్‌లోని కొన్ని ప్రాంతాలకు ఇరవై నాలుగు గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సరూర్‌నగర్ సెక్షన్ పరిధిలోని ఎస్‌బీహెచ్ వెంచర్-1,2, శాతవాహననగర్, గౌతమ్‌నగర్, శివపురి కాలనీ, లింగోజిగూడ, కాకతీయకాలనీ, నారాయణపురి, ఎల్‌బీనగర్ మెయిరోడ్డు, సౌమ్యనగర్, భగత్‌సింగ్ నగర్, శంకర్‌నగర్, బాపూనగర్, చౌడీ, నర్సింహాపురికాలనీ ప్రాంతాల్లో ఈ నెల 18వ తేదీ ఉదయం ఆరుగంటల నుంచి మరుసటి రోజైన 19 ఉదయం ఆరు గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఎల్‌బీనగర్ సెంక్షన్ పరిధిలోని సహారారియా, హిమపురికాలనీ, జడ్జిల కాలనీ, మన్సూరాబాద్, సౌత్ ఎండ్ పార్కు, రాక్‌టౌన్‌కాలనీ, చాణిక్యపురికాలనీ, నవ్వుల బండ, లలితానగర్, ఫతుల్లాగూడ, జనప్రియకాలనీ, జైపురికాలనీ, సరస్వతి నగర్, గణేష్‌నగర్, చింతల్‌కుంట తదితర ప్రాంతాల్లో కూడా సరఫరా ఉండబోదని అధికారులు వెల్లడించారు. దిల్‌సుఖ్‌నగర్ సెక్షన్ పరిధిలోని కొంత భాగంలోని ప్రాంతాలైన కమలానగర్, నేతాజీనగర్, త్యాగరాయనగర్, హనుమాన్‌నగర్, హుడాకాలనీ, చెరుకుతోట కాలనీ, పోచమ్మబాగ్, అంబేద్కర్‌నగర్, మాతా లక్ష్మీనగర్, గడ్డిఅన్నారం తదితర ప్రాంతాలతో పాటు మారుతీనగర్ సెక్షన్ పరిధిలోని ఇందిరానగర్, మోహన్‌నగర్, కొత్తపేట, గాయత్రిపురం, సీటీఓ కాలనీ తదితర ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా ఉండబోదని వెల్లడించారు. అల్కాపురి సెక్షన్ పరిధిలోని స్నేహపరికాలనీ, వాసవీకాలనీ, గ్రీన్‌హిల్స్ కాలనీ, లక్ష్మీనగర్‌కాలనీ, నాగోల్ మెయిన్ రోడ్డు, విజయపురికాలనీ, సమతాపురి కాలనీ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేయునున్నట్లు వెల్లడించారు. ఇంటర్ కనెక్షన్ పనుల కోసం మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు గుర్తించి, ప్రజలు, వినియోగదారులు తమకు సహకరించాలని జలమండలి కోరింది.