హైదరాబాద్

‘కంటివెలుగు’తో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, శేరిలింగంపల్లి: కంటివెలుగు కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రజావైద్యం కార్యక్రమం మరో అడుగు ముందుకు పడిందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన పరీక్షా శిబిరాలను మంత్రి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలకు వచ్చిన వారిని పలకరించి, ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరి చూపు బాగుండాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించటమే గాక, మందులను, అద్దాలను పంపిణీ చేయటంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా శస్తచ్రికిత్సలను చేయించి, చూపును మెరుగుపర్చనున్నట్లు తెలిపారు. జీవితంలో జీవన ప్రమాణాలు అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది వైద్యులు, సిబ్బంది సేవాభావంతో పని చేస్తున్నారని అభినందించారు. ఇందుకు గాను ప్రభుత్వం సరైన వౌలిక వసతులను సమకూర్చిందని, ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 37 రకాలైన ప్రాథమిక, దీర్ఘకాలిక దృష్టిలోపం సమస్యలకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే జనవరి 26వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని, సెలవు రోజుల మినహా మిగిలిన అన్ని పని రోజుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతోందని వివరించారు. ప్రతి రోజు ఒక్కో శిబిరంలో 300 మందికి పరీక్షలు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా, అందరిలో అవగాహన పెంచేందుకు జీహెచ్‌ఎంసీ అనేక రకాల అవగాహన కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా జరిగేందుకు వీలుగా 300 మంది కమ్యూనిటీ రిసోర్సు పర్సన్లను కూడా ఇందులో భాగస్వాములను చేసినట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, హఫీజ్‌పేట, మాదాపూర్ కార్పొరేటర్లు వీ.పూజిత, జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ కార్పొరేటర్ మేకా రమేష్, జోనల్ కమిషనర్ హరిచందన దాసరి, డిప్యూటీ కమిషనర్ టీ.వెంకన్న, శేరిలింగంపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పాశం రాంరెడ్డి, చందానగర్ సర్కిల్ ఏఎంవోహెచ్ డాక్టర్ కేఎస్ రవి, ఏసీపీ ఆర్.శ్రీనివాస రావు, నాయకులు ఉప్పలపాటి శ్రీకాంత్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దొంతి శేఖర్, సురేష్ గౌడ్, ఎం.గంగాధర రావు, పారునంది శ్రీకాంత్, మిర్యాల ప్రకాష్, పోచయ్య, గుర్ల తిరుమలేష్, దేవేందర్ రావు, జక్క సులోచన, గౌస్ పాల్గొన్నారు.