హైదరాబాద్

కేరళ వరద బాధితులను ఆదుకుందాం రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్: వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను, ఇంకా నీటిలోనే చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు మహానగరవాసులు ముందుకు రావాలని కానె్ఫడరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్, మలయాళీ అసోసియేషన్స్ (సీటీఆర్‌ఎంఏ) పిలుపునిచ్చింది. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో సీటీఆర్‌ఎంఏ అధ్యక్షుడు లిబ్బీ బెంజిమెన్ మాట్లాడుతూ కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఆహారం, బిస్కెట్లు, బ్రెడ్, మసాలా పౌడర్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, టూత్ బ్రెష్‌లు, మస్కిటో కాయిల్స్, స్నానపు సబ్బులు, చిన్నపిల్లల దుస్తులు, డెటాల్, నూనెలు వంటివి తమకు అందించాలని ఆయన సూచించారు. ఈ నెల 19న ఆదివారం రవీంద్రభారతిలో ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్య నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో దాతలు ఈ వస్తువులను తమకు అందించవచ్చునని సూచించారు. ఈ సమావేశంలో సీటీఆర్‌ఎంఏ డిజాస్టర్ కమిటీ కన్వీనర్ కే.డీ.ఉదయన్ తదితరులు పాల్గొన్నారు.