హైదరాబాద్

లక్ష్యాలను సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: జిల్లాలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో తహశీల్దార్లకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. కంటివెలుగు వైద్య పరీక్షల కేంద్రాల పనితీరు, ఏర్పాట్లపై కలెక్టర్ శనివారం తన ఛాంబర్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటివెలుగు కార్యక్రమం సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు నిర్దేశించిన టార్గెట్ ప్రకారం ప్రజలు ఈ శిబిరాలకు హాజరయ్యేలా, ప్రజాసమీకరణ కోసం డీపీఓలను సంప్రదించాలని సూచించారు. ఇందుకు స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు సహాయం తీసుకోవాలని పేర్కొన్నారు. శిబిరాలలో ప్రజలకు అవరమైన మందులను, కంటి చుక్కల మందును, అద్దాలను సరిపడే స్థాయిలో ముందుగానే నిల్వ ఉంచాలని ఆదేశించారు. శిబిరాల వద్ద రద్దీని అధిగమించేందుకు ఇద్దరు అప్తాల్మాజిస్టులు, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల పేర్లు, వివరాలు పునరావృత్తం కాకుండా కూపన్ల నమోదుతో క్లుప్తంగా నమోదు చేయాలని, కంటి పరీక్షల కోసం వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, మండలాల వారీగా నియమితులైన ఇన్‌చార్జి అధికారులు చక్కటి సమన్వయంతో రోజువారి విధులకు అంతరాయం లేకుండా కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఏదైనా సమస్య తలెత్తినపుడు, అత్యవసరమనుకుంటే డీఎంహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమ శిబిరాల నిర్వాహణపై ప్రతిరోజు నివేదికలు పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మండలవారీగా కార్యక్రమ ఇన్‌చార్జిలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ వెంకటి, కంటివెలుగు నోడల్ ఆఫీసర్ నాగార్జున, మండలాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

కస్తూర్భ సిబ్బందిపై వేధింపులు మానుకోవాలి
* టీఏస్ యూటీఏఫ్ డిమాండ్
బొంరాస్‌పేట, ఆగష్టు 18: కస్తూర్భ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందిపై అధికారులు వేధింపులు మానుకోవాలని టీఏస్ యూటీఏఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెనె్నల సత్యం, మల్లికార్జున్ డిమాండ్ చేశారు. శనివారం విలేఖరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులు లేకుండా ఏ ఆసరా లేని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం తగదని అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో జీసీడీవో వరలక్ష్మీ వేధింపులకు శ్రీలత అనే ఉపాధ్యాయురాలు బలికావడం శోఛనీయమని పేర్కొన్నారు. శ్రీలత మరణానికి కారణమైన జీసీడీఓ వరలక్ష్మీని వెంటనే సర్వీసు నుంచి తొలగించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేస్తున్న కస్తూర్బా ఉపాధ్యాయుల పట్ల అధికారుల తీరు మారకపోతే టీఏస్ యూటీఏఫ్ పొరాటానికి వెనుకాడదని హెచ్చరించారు.