హైదరాబాద్

సర్కారు బడుల్లో ఆధునిక వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: సర్కారు బడుల్లో వౌలిక వసతులను కల్పించటంతో పాటు లైబ్రరీ, ల్యాబ్ వంటి సౌకర్యాలను ఆధునీకరించనున్నట్లు కలెక్టర్ యోగితారాణా వెల్లడించారు. రూ.కోటి ఖర్చుతో 64 లైబ్రరీలు, మూడు ల్యాబ్‌లతో పాటు జవహర్‌బాలభవన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.
శనివారం విద్యాభవన్‌లో కలెక్టర్ ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు, ఎంఈఓలతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో శిథిలావస్థకు చేరిన 17 తరగతి గదులను కూల్చివేయనున్నట్లు, మరో 62 తరగతి గదులకు మరమ్మతులు చేయనున్నట్లు తెలిపారు. మూడు వేల మంది బాలికలకు సుకన్య సమృద్ది యోజన ఖాతాలను దత్తత చేసుకునేందుకు ముందుకు వచ్చిన అధికారులను కలెక్టర్ అభినందించారు. 63 ఉన్నత పాఠశాలల్లోని లైబ్రరీలో ఫర్నిచర్, మూడు పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, బాలభవన్‌ను బిర్లా పారిటోరియం సహకారంతో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన కృషియల్ బ్యాలెన్స్ ఫండ్ నుంచి రూ.కోటి నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు.
పాఠశాలల్లో ఉన్న సైన్స్ పరికరాలను బీరువాలకే పరిమితం చేయరాదని, వాటి దుమ్ము దులిపి విద్యార్థులచే ల్యాబ్ పరీక్షలు చేయించాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల ఆధార్‌కార్డుల వివరాలను సేకరించే బాధ్యతను సీఆర్‌పీలకు అప్పగించాలని ఆదేశించారు. పాఠశాల న ఇర్వాహణ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శుల సహకారాన్ని కూడా తీసుకోవాలని సూచించారు. బాలికల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందుకు ఇప్పటికే వారికి అప్పగించిన కార్యక్రమాలను ఎలాంటి లోపాల్లేకుండా విజయవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. రక్తహీనత లేని బాలికల హైదరాబాద్‌గా నగరాన్ని తీర్చిదిద్దటంలో ప్రతి అధికారి చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
రూ.12లక్షలతో విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణను ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఫోక్సోచట్టం పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఇలాంటి ముఖ్యమైన విధులతో వృత్తిపరమైన సంతృప్తి పొందుతున్నట్లు కలెక్టర్ అభిప్రాయపడ్డారు.ఈ సమావేశాల్లో డీఈఓ వెంకటనర్సమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ హన్మంత్‌నాయక్, సర్వశిక్షా అభియాన్ ఈఈ భాస్కర్, బాలిక మంచ్ జిల్లా నోడల్ ఆఫీసర్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

చెట్లు నరికించినందుకు జరిమానా
ఉప్పల్, ఆగస్టు 18: ఉప్పల్ పారిశ్రామిక వాడలోని వెలుగుట్టపై ఉన్న శ్రీ మల్లిఖార్జున భ్రమరాంబ, దుర్గామాత ఆలయం సమీపంలో అనుమతి లేకుండా చెట్లు నరికించినందుకు ఆలయ ఈవో భాగ్యలక్ష్మికి అటవీ శాఖ రూ.10వేల జరిమానా విధించింది. సకాలంలో జరిమానా చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆలయం సమీపంలో దాతల సహకారంతో నూతనంగా శ్రీ వేంకటేశ్వర ఆలయం నిర్మాణ పనులకు ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అదే స్థలంలో పెరిగిన మూడు చెట్లను అనుమతి లేకుండా నరికివేయించారని ఆలయ ధర్మకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించారు. జరిగిన తప్పును ఒప్పుకుని విధించిన రూ.10వేల జరిమానా డబ్బులను వ్యక్తిగతంగా చెల్లిస్తానని, మొక్కలు నాటి పెంచుతానని ఈవో లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్లు పేర్కొన్నారు.