రంగారెడ్డి

ఆసియా క్రీడలకు ప్రభుత్వ ప్రతినిధిగా సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ఇండోనేషియా జకార్తలోజరుగనున్న ఏషియన్ గేమ్స్‌ను వీక్షించడానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెంలగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ మేరకు తెంలగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. జకార్తలో జరుగనున్న ఏషియన్ గేమ్స్‌కు తెలంగాణ రాష్ట్రం నుండి సూమారు 12 నుంచి 15 మంది క్రీడాకారులు వివిధ క్రీడపోటీలో పాల్గొనేందుకు ఎంపికైన సందర్భంగా వారిని ప్రోత్సహించడానికి , అలాగే క్రీడలను వీక్షించేందుకు సాట్స్ చైర్మన్‌ను ప్రభుత్వం రాష్ట్ర ప్రతినిధిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎషియన్ గేమ్స్‌కు ఎంపికైనా తెలంగాణ క్రీడాకారులను ప్రొత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపిక చేసింనందుకు సీఏం కేసీఆర్, క్రీడల శాఖ మంత్రి పద్మారావుకు కృతజ్ఞలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొంటున్న రాష్ట్ర క్రీడాకారులు బంగారు పతకాలు సాధించి, దేశానికి, తెంలగాణ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తేవాలన్నారు.

విద్యార్థుల ఆసక్తిని ప్రోత్సహించాలి
హయత్‌నగర్, ఆగస్టు 19: విద్యార్థులకు ఆసక్తిగల రంగాలను ప్రోత్సహించి ఆ దిశగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని ప్రముఖ విద్యావేత్త యశ్వంత్‌కుమార్ పేర్కొన్నారు. కర్మన్‌ఘాట్ చౌరస్తాలోని న్యూయోరాయల్ హైస్కూల్ ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి చేసిన సాంస్కృతిక, నాటక ప్రదర్శనలు, కరాటే విన్యాసాలు ఆహుతులను అబ్బురపరిచాయి. ముఖ్యఅతిథులుగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్ యశ్వంత్‌కుమార్ వేడుకలను ప్రారంభించారు. విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా రంగాలు విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని కల్గిస్తాయని తెలిపారు. విద్యార్థుతల అభిరుచి మేరకు అన్ని రంగాలలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల నడవడికలపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

విద్యార్థులు క్రీడా రంగంలో రాణించాలి
కాచిగూడ, ఆగస్టు 19: విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించాలని వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాజేష్ కౌల్ అన్నారు. విలేఖరులతో ఆయన మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాలతోపాటు అంతర్జాతీయ స్థాయి వరకు భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న క్రీడ వాలీబాల్, ఫుట్‌బాల్ అని తెలిపారు. వాలీబాల్ లీగ్ ఔత్సాహిక అథ్లెట్లకు వేదికగా తమ నైపుణ్యాన్ని వెలికితీసే అవకాశం, అంతర్జాతీయ సుప్రసిద్ధ ఆటగాళ్లతో ఆడే అవకాశం వస్తుందని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో నిర్వహించే లీగ్ ఆకృతిలో 18 మ్యాచ్‌లు జరుగుతాయని, జాతీయ టీమ్‌లకు చెందిన పురుషులతో పాటు వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటారని చెప్పారు. సోనీ పిక్చర్ నెట్‌వర్క్స్ ఇండియా బేస్‌లైన్ వెంచర్స్ వాలీబాల్ లీగ్ సీజన్‌ను ప్రసారం చేస్తాయని తెలిపారు.