హైదరాబాద్

బడుగు బలహీనవర్గాల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్: బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం నందిగామలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ కులాలు, మతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతున్నారని వివరించారు. బసవేశ్వరుడు చూపిన మార్గంలో పయనించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్నివర్గాల ప్రజలను ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుందని వివరించారు.
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంజయ్య యాదవ్‌ను వీరశైవ లింగబలిజ సంఘం అధ్యక్షుడు మోముల చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్, నాయకులు జె.వెంకట్‌రెడ్డి, యువసత్తా యూత్ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్, నందిగామ కృష్ణ, వీరశైవలింగ బలిజ సంఘం సభ్యులు ఉన్నారు.

తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలి
కాచిగూడ, ఆగస్టు 19: తెలుగు సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని లయన్ విజయ్ కుమార్ అన్నారు. లలిత కల్చరల్ అసోసియేషన్, సాయికృప డ్యాన్స్, మ్యూజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘శతపద నాట్య నీరాజనం’ కార్యక్రమం ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ కుమార్ మాట్లాడుతూ..కళాకారులను ప్రోత్సహిస్తున్న లలిత కల్చరల్ అసోసియేషన్‌ను అభిందించారు. ప్రముఖ గాయకుడు సిహెచ్ త్రినాథరావు, కాటమాంబ సరోజిని, జయలక్ష్మీకి పురస్కారాలను ప్రదానం చేశారు. 108 మంది కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
సాల్వచారికి ‘నట కౌస్త్భు’ బిరుదు ప్రదానం
కాచిగూడ, ఆగస్టు 19: ప్రపంచ మానవతావాద దినోత్సవం సందర్భంగా ప్రముఖ పౌరాణిక నటుడు సాల్వచారికి ‘నట కౌస్త్భు’ బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం వైఎస్‌ఆర్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆచార్య కొలకలూరి ఇనాక్, వైఎస్‌ఆర్ మూర్తి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, డా.అనురాధ విశ్వనాథ్, డా.పసుమర్తి శేషుబాబు పాల్గొని బిరుదును ప్రదానం చేశారు. మానవతావాద దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమని తెలిపారు. నృత్య గురువులు రూప ప్రవీణ్, మోనికాదేవి శిష్య బృందం నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.