హైదరాబాద్

పెట్రోల్ దొంగలున్నారు జర భ ద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ: నివాస ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు పెట్రోల్, డీజిల్ తీస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు పట్టపగలే ట్యాంకర్ల నుంచి పైపులతో పెట్రోల్ తీస్తుంటే.. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకోస్తోందని భయపడుతున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి కేసులు నమోదు చేసినా ట్యాంకర్ డ్రైవర్లు యథేచ్ఛగా పెట్రోల్ తీస్తున్నరని కాలనీవాసులు తెలిపారు. నివాస ప్రాంతాల్లోనే పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు, స్థానికులను ఏర్పాటు చేసుకుని డ్రైవర్లతో పెట్రోల్, డీజిల్ తీస్తుంటే కాలనీ ప్రజలు ఆడిగితే దాడులు చేయిస్తున్నారని ప్రజలు పేర్కొన్నారు. గోకుల్‌నగర్‌లో మరో పెట్రోల్ ప్రమాదం పొంచివుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోకుల్‌నగర్ ప్రైవేట్ పాఠశాల సమీపంలోనే ఈతుంతు జరుగుతున్నా పోలీసులు నిద్రమత్తులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి నెలా రూ.లక్షలో మామూళ్లు
మల్లాపూర్ గోకుల్‌నగర్‌లో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ప్రతి నెలా పోలీసులకు రూ.లక్షలో మామూళ్లు అందజేస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తే తప్ప స్థానిక పోలీసులు దాడులు చేసిన సంఘటనలు కనిపించడంలేదని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులకు గోకుల్‌నగర్ కాలనీ సంఘాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.