హైదరాబాద్

ట్రాఫికర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో చినుకుపడిందంచే చాలు అన్నీ చిక్కులే. ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగిస్తూ రాకపోకలు సాగించే వారి మాట అలా ఉంచితే, నగరంలో ఎక్కువ శాతం బైక్‌లపై రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ ప్రత్యక్ష నరకాన్ని చూపుతోంది. వాహనం బయటకు తీసేందుకు జనం జంకుతున్నారు. ఇక శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్న వారిని ఎపుడు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాహనదారులకు ఇబ్బందులు రెట్టింపయ్యాయి. మామూలు పరిస్థితుల్లోనే చినుకు పడితే చాలు వాహనంపై ప్రయాణం ప్రత్యక్ష నరకాన్ని చూపుతోంది. ఇక గడిచిన ఒకటిన్నర రోజు నుంచి వరుసగా జల్లులు కురుస్తుండటంతో నగరం తడిసి ముద్దయింది. కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా నగరంలో మెట్రోరైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడువున ట్రాఫిక్ స్తంభిస్తోంది. ముఖ్యంగా నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు కొంతమేరకైనా ఉపశమనం కల్గించేందుకు నిర్మించిన ఫ్లైఓవర్లపై వర్షం కురిసినపుడు వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణణాతీతం. ఒక్కో ఫ్లై ఓవర్‌పై సుమారు గంట నుంచి అరగంట వరకు ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిల్చిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అన్నింటి కన్నా ఎక్కువ వాహనాలు రాకపోకలు సాగించే ఖైరతాబాద్, బేగంపేట ఫ్లైఓవర్లపై టాఫిక్ నిల్చిపోవటంతో ఫ్లై ఓవర్ కింద కూడా వాహన రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభింపోయాయి. మరికొన్ని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పనిచేయకపోవటంతో వాహనరాకపోకలు అస్తవ్యస్తంగా మారి, చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక వర్షాకాలం రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రౌండ్ ది క్లాక్ ఇన్‌స్టెంటు రిపేర్ టీంలను అందుబాటులో ఉంచుతామని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించినా, ఎక్కడా కూడా రోడ్లకు మరమ్మతులు చేపడుతున్న సందర్భాల్లేవు. మెట్రోరైలు పనులు పూర్తయిన బోయిగూడ, బేగంపేట, ఖైరతాబాద్, మోజాంజాహి మార్కెట్, నల్గొండ క్రాస్‌రోడ్డు, సికిందరాబాద్ నుంచి సుల్తాన్‌బజార్ వెళ్లే దారిలో ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవటం కూడా ట్రాఫిక్ సమస్య రెట్టింపయ్యేందుకు ప్రధాన కారణమని వాహనదారులంటున్నారు. నిత్యం జనం రాకపోకలతో బిజీగా ఉండే పంజాగుట్ట, బేగంపేట, లక్డీకాపూల్, నారాయణగూడ వంటి ప్రధాన కూడళ్లలో రాత్రి ఎనిమిది గంటలకే రాకపోకలు పలుచబడుతున్నాయి. శివార్లలో హాడ్కో తాగునీటి ప్రాజెక్టు కోసం రోడ్లపై చేపట్టిన తవ్వకాలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయకపోవటంతో ట్రాఫిక్ సమస్య తప్పటం లేదు.

రాఖీతో పాటు హెల్మెట్ బహుమతి
నగర సీపీ అంజనీ కుమార్ పిలుపు
హైదరాబాద్, ఆగస్టు 20: అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరులకు రాఖీతో పాటు హెల్మెట్‌ను బహుమతిగా ఇవ్వాలని సీపీ అంజనీ కుమార్ పిలుపు నిచ్చారు. సోమవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సిస్టర్ ఫర్ చేంజ్, గిఫ్ట్ ఏ హెల్మెట్ పేరుతో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగృతి సంస్థ రాఖీ పౌర్ణమి నాడు హెల్మెట్‌ను బహుమతిగా ఇవ్వాలని ప్రచారం నిర్వహించడం గొప్ప విషమని అన్నారు. చాలా రోడ్డు ప్రమాదాల్లో హెల్మ్‌ట్ లేని కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని అలాంటి వారిని రక్షించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతోందని అన్నారు.

ఎన్నో పథకాలు ఎంతో అభివృద్ధి
* ఎన్నో ఉద్యోగాలిచ్చాం మంత్రి మహేందర్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 20: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన అభివృద్ధి పనులే తిరిగి అధికారంలోకి తెస్తాయని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తన నివాసంలో ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ గత నాలుగన్నర ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అమలుపరిచిందని అన్నారు. ఇంటింటికి మంచినీరు, చెరువుల అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. భూ పక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతులకు ఎకరాకు రూ.4వేల చొప్పున ఆర్థిక సహాయంతోపాటు ప్రతి రైతుకి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరిగి అధికారంలోకి తీసుకువస్తారని ఆయన అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో (వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు) ని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉందని, అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని మంత్రి తెలిపారు. గత నాలుగన్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని, వారివారి పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలతోనే సతమవుతూ దిక్కుతోచని స్థితిలో టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడుతున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్ చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోని ప్రధాన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, ఇప్పటికే చాలామంది చేరారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చినా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మళ్లీ అధికారం కట్టబెట్టడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం తమ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వొమ్ము చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, మరో 20 ఏళ్ళు అయినా టీఆర్‌ఎస్ అధికారంలో ఉండటం ఖాయమని ఆయన అన్నారు. నిరుద్యోగ యువకులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికమించేందుకు యువకుడు కేటీఆర్ అనేక పరిశ్రమలను నెలకొల్పేందుకు శ్రమిస్తున్నారని, ఇప్పటికే వేల సంఖ్యలో స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించాయని ఆయన అన్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తున్న కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూనే జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులై కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారంటూ ఆయన అభినందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలతో జిల్లాకో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా ఆశావాహులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 20 అసెంబ్లీ స్థానాలకంటే ఎక్కువ విజయం సాధిస్తే గొప్పేనని విమర్శించారు.