క్రైమ్/లీగల్

కట్నం కేసులో ఎస్సైకి ఐదేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహకరించిన ఎస్సై తల్లికి మూడేళ్ల జైలు
రాజమహేంద్రవరం, ఆగస్టు 23: వరకట్న వేధింపుల కేసులో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఎం సతీష్‌కుమార్‌కు ఐదేళ్లు, గృహహింస చట్టం కింద మరో 3ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం 5వ రాజమహేంద్రవరం ఎజెఎఫ్‌సిఎం కోర్టు న్యాయమూర్తి సిహెచ్ రామకృష్ణ తీర్పునిచ్చినట్లు రాజమహేంద్రవరం మహిళా పోలీసు విభాగం డీఎస్పీ భరత్‌మాతాజీ తెలిపారు. అలాగే రూ. 18లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సతీష్‌కుమార్ మేడ్చెల్ ఎస్‌ఐగా పనిచేస్తున్న సమయంలో కేసు నమోదైనట్లు తెలిపారు.
గోరక్షణపేటకు చెందిన శిరీషాదేవికి సతీష్‌కుమార్‌తో 2014లో వివాహమైంది. కొద్దికాలం తరువాత ఎస్‌ఐ, అతని తల్లి అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో పాటు, శారీరకంగా హింసించారు. ఈమేరకు శిరీషాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈకేసును విచారించిన న్యాయమూర్తి గురువారం తీర్పునిచ్చారు. ఈకేసులో ఎస్సైకి సహకరించిన తల్లి విజయశారదకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. రఘువీర్ ప్రాషిక్యూషన్ నిర్వహించారు.