హైదరాబాద్

ఉరుకులు..పరుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాలు..మోహర్రం పండుగలు..ముందస్తు ఎన్నికల హడావుడి కారణంగా నగర పోలీసులకు ఉరుకులు పరుగులు తప్పేట్టులేవు. రొటీన్ విధి నిర్వహణలకు ఒకవైపు వరుస పండుగలు, మరోవైపు ఎన్నికల హడావుడి తోడుకావటంతో వీఐపీలకు బందోబస్తు, రాజకీయ ప్రముఖుల రాకపోకలతో ఎయిర్‌పోర్టు నుంచి వారు పర్యటించే ప్రాంతాల వరకు చేపట్టే బందోబస్తులతో పోలీసులకు పనిభారం పెరగనుందనే చెప్పవచ్చు. గురువారం నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై, పదకొండు రోజుల పాటు కొనసాగుతుండటం, పలు మండపాలకు వీఐపీలు, అమాత్యుల రాకపోకలు, మరో వర్గం వారి మోహర్రం ఊరేగింపులకు పోలీసులు బందోబస్తు వంటివి చేయాల్సి ఉంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఏర్పాటయ్యే ఒక్కో వినాయక మండపం వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేకంగా పికెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మండపంలో, మండపం ఆవరణ, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించనున్నారు. రాత్రిపూట మండపాల వద్ద పరిస్థితులను ఎప్పటికపుడు పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాల కోసం ఇరుగుపొరుగు జిల్లాల నుంచి పోలీసులను రప్పిస్తున్నారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే సాయుధ బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు ఎన్నికల ప్రచారంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. అధికార పార్టీకి సంబంధించి ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు, కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై స్పష్టత వచ్చి అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తర్వాత నగరంలో రాజకీయ సందడి మరింత ఎక్కువయ్యే అవకాశముంది. అంతలో వినాయక నిమజ్జనం వస్తోంది. నిమజ్జనానికే వేలాది మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తుంటారు. అప్పటికీ ఎన్నికల ప్రచారం ఊపందుకునే అవకాశముండటంతో అన్ని ప్రశాంతంగా, సవ్యంగా జరిగిపోయేందుకు వీలుగా పోలీసులు బందోబస్తుప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. పోలీసులతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వరుస పండుగలు, ఎన్నికల హడావుడితో పనిభారం పెరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, వైద్యయేతర సిబ్బంది మళ్లీ ఎన్నికల విధులకు హాజరుకావాలని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఓటరు జాబితా సవరణలో ఓటర్లు తమ వివరాలున్నాయా లేదా తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉన్నందున, సెలవులతో ప్రమేయం లేకుండా ఎన్నికల సిబ్బంది బూత్‌లలో విధులు నిర్వర్తించాల్సి ఉన్నా, రౌండ్ ది క్లాక్ విధులు నిర్వర్తించే పోలీసులకే ఎక్కువ ఉరుకులు, పరుగులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
బీజేపీ రాష్ట్ర ఓబీసీ ప్రచార కార్యదర్శిగా
కేశబోయిన శ్రీ్ధర్

హైదరాబాద్, సెప్టెంబర్ 12: భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ విభాగం ప్రచార కార్యదర్శిగా కేశబోయిన శ్రీ్ధర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కే.లక్ష్మణ్ నుంచి ఆయన నిమాయమక పత్రాలను స్వీకరించారు. భారతీయ జనతాపార్టీని బలోపేతం చేసేందుకు తాను చేస్తున్న కృషిని గుర్తించి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాధ్యతలు అప్పగించినందుకు అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో జరగనున్న ముందసు ఎన్నికల్లో అది నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీ పార్టీ విజయానికి సమష్టి కృషి చేస్తానని శ్రీ్ధర్ వ్యాఖ్యానించారు. పేద, బడుగు, బలహీనవర్గాల కోసం కేంధ్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పలు సంచలనాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ పట్ల ప్రజాదరణను పెంపొందించనున్నట్లు వివరించారు.