హైదరాబాద్

మస్తు బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జంటనగరాల్లో ప్రారంభమైన వినాయకచవితి, మొహర్రం పండుగలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. ఆదివారం నగర కమిషనర్ కార్యాలయంలో డీజీపీ అధికారులతో పండుగలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఈ పండుగల సందర్భంగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చిపోయే ప్రజలు ఎక్కువగా ఉంటారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అసాంఘిక శక్తులు కూడా హైదరాబాద్‌లో ప్రవేశించే ప్రమాదం పొంచి ఉందని ఆయన గుర్తుచేశారు. మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో పాతబస్తీకి చెందిన కిరాయి రౌడీ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో ఉందన్నారు. షియా ముస్లింలు అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించే మొహర్రం సంతాప కార్యక్రమాలు జరుగుతున్నందున పాతబస్తీలో పోలీస్ బలగాలను పెంచాలన్నారు. మొహర్రం సందర్భంగా అక్కడికి వచ్చే ముస్లింలకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, వివిధ శాఖల అధికారులు పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. మొహర్రం పదోరోజు ఏనుగు అంబారిపై బీబీకా ఆలంను ఊరేగించేందుకు ఇప్పటికే అధికారులు సన్నాహాలు పూర్తి చేశారన్నారు. మొహర్రం మాసంలో వజ్రాలతో పొదిగిన బీబీకా ఆలంను డబీర్‌పురా, జొహ్రానగర్, బీబీకా ఆలం నుంచి పాత నగరంలో వివిధ ప్రాంతాల మీదుగా చాదర్‌ఘాట్‌లోని కాలికాబర్ మసీద్ వద్ద ముగుస్తుంది. భారీగా ప్రజల రాకతో ఏనుగు బెదిరిపోకుండా ఉండడానికి నెహ్రూ జంతుప్రదర్శనశాలలోని ‘రజిని’ అనే ఏనుగును మొహర్రం కార్యక్రమాలకు తీసుకువస్తున్నారు. మోహర్రం పండుగను దృష్టిలో పెట్టుకుని పాతనగరం ప్రధాన కూడళ్ళ వద్ద రంగులు వేయడం జరిగింది.