హైదరాబాద్

ఘనంగా హైదరాబాద్ విలీన దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సారధ్య బృందం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ విలీన దినోత్సవం ఘనంగా జరిగింది. కోఠి బస్ స్టాండ్‌లోని అమర వీరుల స్మారక అశోకా స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్యర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ప్రభృతులు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం కన్వీనర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. నిరంజన్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బాబురావు వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ విలీన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులకు నేతలు నివాళి అర్పించారు.