హైదరాబాద్

ప్రణయ్ హత్య బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 18: ఆధునిక సమాజంలోనూ కులం పేరుతో వివక్ష, హత్యలు జరగడం అత్యంత విచారకరమని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘మిర్యాలగూడ ఘాతుకంపై’ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిధులుగా జస్టిస్ లక్ష్మణ రెడ్డి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ రామ మేల్కోటే, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, సీనియర్ పాత్రికేయులు రామచంద్ర మూర్తి పాల్గొని మాట్లాడారు.

జీపీ పల్లి రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛ భారత్
మేడ్చల్, సెప్టెంబర్ 18: మండలంలోని గుండ్లపోచంపల్లి రైల్వేస్టేషన్‌లో మంగళవారం బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. రైల్వే ఫ్లాట్‌ఫారంపై చెత్త చెదారాలను తొలగించారు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను ఊడ్చి శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు అమరం మోహన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నేతలు విక్రం రెడ్డి, కిషన్, అనిల్, నాగరాజు, శివరాజు, సత్తిరెడ్డి, నవీన్, మహేశ్, నరేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.

హరిత హారంగా మూసీ పరివాహక ప్రాంతం
ఉప్పల్, సెప్టెంబర్ 18: మూసీ పరివాహక ప్రాంతాన్ని హరితహారంగా తీర్చిదిద్దడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కమిషనర్ డాక్టర్ బీ.జనార్ధన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీ చేసేందుకు సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటనలో భాగంగా మొక్కలను నాటారు. నాటిన మొక్కలను పరిశీలించారు. ఉప్పల్ భగాయత్ ఫేస్-2 లేఅవుట్ పనులను పర్యవేక్షించారు. ఇదే ప్రాంతంలో అభివృద్ధి చేసిన పచ్చదనాన్ని పరిశీలిస్తూ మూసీ నదీ సుందరీకరణ పనుల్లో భాగంగా అమలు చేస్తున్న అభివృద్ధి పనులను సమీక్షించి ఈ ప్రాంతాన్ని హరితహారంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగలంపల్లి, బాట సింగారంలో పీపీపీ పద్ధతి ద్వారా చేపట్టిన లాజిస్టిక్ పార్కుల పనులను పరిశీలించి రానున్న జనవరిలోగా అన్ని పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. తుర్కయంజాల్ నుంచి గుర్రం గూడ వరకు రహదారి వెంట మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్వాల్ గూడలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సింగపూర్ తరహాలో స్ధాపించనున్న నైట్ సఫారీ కోసం 130 ఎకరాల విస్తీర్ణం గల స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు నివేదికను అందజేయాలన్నారు. చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, అర్భన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.