క్రైమ్/లీగల్

పట్టపగలు కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, సెప్టెంబర్ 18: పట్టపగలు బంగారం దుకాణంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించిన సంఘటన దమ్మాయిగూడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం దమ్మాయిగూడ గ్రామంలోని దుబాయ్ బిల్డింగ్ పక్కనే ఉన్న ఆర్‌ఎస్ రాథోర్ జ్యువెల్లరీ షాపునకు ఆరుగురు గుర్తు తెలియని దుండగులు మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. ఇద్దరు దుండగులు షాపులోనికి ప్రవేశించారు. మిగిలిన నలుగురు షాపు బయట నిలబడ్డారు. 15వేలల్లో బంగారు గొలుసు కావాలని యజమాని రూప్‌సింగ్‌ను కోరారు. 15వేలల్లో గొలుసు రాదని రూప్‌సింగ్ తెలుపగా, ఉంగరం చూపించమని తెలిపారు. దుండగుల కదలికలపై అనుమానం వచ్చిన రూప్‌సింగ్ చోర్‌చోర్ అని కేకలు వేయటంతో షాపులో ఉన్న ఇద్దరు దుండగులు రూప్‌సింగ్ నోటిపై బలంగా కొట్టారు. యజమాని కేకలు విన్న పక్కషాపు మహిళ అక్కడికి వచ్చి దొంగలు దొంగలు అని గట్టిగా కేకలు వేయటంతో ఇద్దరు దుండగులు బయటికి వచ్చి పిస్టల్‌తో గాలిలోకి ఒక్కసారి కాల్పులు జరిపి, ద్విచక్ర వాహనాలపై నాగారం వైపు పారిపోయారు. అక్కడే ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి వారిని పట్టుకునేందుకు వెంబడించటంతో ఇద్దరు దుండగులు వెళుతున్న ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. శ్రీకాంత్‌ను దుండగులు ముఖంపై కొట్టి అతని బైక్‌పై పారిపోయారు. కాగా దుండగులు ఉపయోగించిన బైక్ ఒకటి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అపహరణకు గురైనట్లుగా కేసు నమోదు అయింది. సమాచారం అందుకున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్ క్లూస్‌టీంతో అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరించి, సీసీ టీవీ పుటేజీలను, దుండగులు జరిపిన కాల్పుల బుల్లెట్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ శివకుమార్, సీఐ సురేందర్ గౌడ్, ఎస్‌ఐ రవి కుమార్ పాల్గొన్నారు.

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి రిమాండ్
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 18: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ కథనం ప్రకారం.. మల్లేష్, ఉమేష్ షా, బుక్యా సాయికుమార్ నాయక్ అనే ముగ్గురు స్నేహితులు ఈజీగా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. దానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలనే దురాశతో ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి గంజాయి కిలోల లెక్కన తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లలో గ్రాముల లెక్కన ప్యాకింగ్ చేసి నగరంలోని ఐటి ఉద్యోగులు, కాలేజీలు హోటళ్లు, ఆటోలు, రద్దీగా జనాలు ఉండే ప్రాంతాలను ఎంచుకొని గంజాయిని సరఫరా చేస్తుంటారని వీరికి తకరాం, భరత్, సుధాకర్ అనే ముగ్గురు గంజాయి ఎక్కడి ప్రాంతంలో సరఫరా చెయ్యాలి, కస్టమర్లను సెల్‌ఫోన్‌లో సంప్రదించి ఆర్డర్లు తీసుకుంటు వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని, పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఆదిలాబాద్ నుంచి గంజాయి తీసుకువస్తున్న ముగ్గురు సభ్యులు ముఠాను సోమవారం మధ్యాహ్నం అగ్రికల్చర్ కళాశాల గేటు సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించగా తాము చేస్తున్న గంజాయి వ్యాపారం గురించి పూర్తి వివరాలు సేకరించి వారి నుంచి ఒక సెల్‌ఫోన్, ఆరు కిలోల గంజాయి, రూ.72,500లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.