క్రైమ్/లీగల్

ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, సెప్టెంబర్ 19: చదివింది ఎంబీఏ... ఎంతో తెలివి తేటలు ఉండి కూడా అక్రమార్గంలో సులువుగా డబ్బులు సంపాదించాలని మోసాలకు తెరతీసిన నిందితుడిని అతనికి సహకరించిన మరు ఇద్దరు వ్యక్తులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ సమయంలో ఎక్కవ డబ్బులు సంపాదించాలంటే తమ సంస్థలో సభ్యులుగా చేరాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ లక్ష్యంగా చేసుకుని మోసం చేసి బోర్డు తిప్పెసిన ముగ్గురు వ్యక్తులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశా రు. నిందితుల నుంచి 40వేలు నగదు 10ల్యాప్ ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. మహారాష్టక్రు చేందిన శంసుద్దీన్ ఆక్తర్ (35) చదివింది ఎంబీఏ చదవిన చదువుతో ఉద్యోగం సంపాదించుకుంటే ఎంతో అభివృద్ధి చెందేవాడు. బుద్ది వక్రమార్గంలో పయనించడంతో మహ్మద్ జీషాన్ ఖలీల్ సిద్ధిఖీ (24) మహ్మద్ అక్బర్ (36) కలసి మోసాలకు శ్రీకారం చుట్టాడు. నగరంలో అతి పెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ 7 ఎలెవన్ ఫుడ్ సి పేరుతో మారో యాప్‌ను రూపోందించి ఫుడ్ డెలివరీ బాయ్స్‌ని మోసం చేశాడు. డెలివరీ బాయ్‌గా చేరాలంటే 1500 వందల రూపాయలు చేల్లించి పేరు నమోదు చేసుకువాలని ప్రచారం చేసుకున్నాడు. తనకు డబ్బు చాల అవసరం ఉందని కేజీ ఉల్లిగడ్డ 7రూపాయలకు కోనుగోలు చేసిన ఉల్లిని విక్రయించుకుని పారిపోయినట్లు డీసీపీ తెలిపారు. సెప్టెంబర్ 28న రాయదుర్గంలోని జేఆర్‌సీ కనే్వన్షన్ సెంటర్‌లో అరేబియన్ నైట్ పేరుతో ఈవెంట్ ఏర్పాటు చేస్తునట్లు భారీ స్థాయిలో టికేట్లు తయారు చేశాడు. జంటకు 5వేలు రూపాయలు చేల్లిస్తే ఇష్టమోచ్చినంత మద్యం, కావలసినంత బీర్యానీ తినవచ్చని ప్రచారం చేసుకున్నాడు. అరేబియన్ నైట్‌కు సంబంధించిన టికెట్లను బెంగళూర్‌లో విక్రయించడానికి పథకం వేశాడు. చివరికి క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ వత్తిడి చేయడంతతో పారిపోయాడు. 20 ప్రధాన నగరాల్లో తన విస్తరించాలని ఆలోచనలతో పలువురు వ్యాపారులను కలివడం జరిగినట్లు డీసీపీ చెప్పారు. మహారాష్టల్రో నిందితుడు శంసుద్దీన్ మోసం చేసిన కేసు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. కార్యక్రమంలో మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు, రాయదుర్గం సీఐ రాంబాబు, డీఐ విజయ్ కుమార్, ఎస్‌ఐలు శశిధర్, మురళీధర్‌తో పాటు సిబ్బందిని డీసీపీ అభినంధించారు.

హత్యాయత్నానికి పాల్పడ్డ తండ్రి అరెస్టు
* హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు * డీసీపీ ఏఆర్ శ్రీనివాస్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 19: కూతురు, అల్లడిపై హత్యాయత్నానికి పాల్పడ్డ మనోహర చారిని సంజీవరెడ్డినగర్ పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఇది పరువుకు సంబంధించిది కాదని, కేవలం కుమార్తె తమను కాదని వివాహం చేసుకుందన్న కోపంతోనే దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిపారు. ఈనెల 12న నిందితుని కుమార్తె మాధవి, సందీప్ అల్వాల్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఆనాటి నుంచి కుమార్తెతో మాట్లాడేందుకు చారి ప్రయత్నించినా నిరాకరించింది. వారం రోజులుగా మద్యం సేవిస్తూ కుమార్తె గురించే ఆలోచించాడు. పథకం ప్రకారం బుధవారం మధ్యాహ్నం కుమార్తెకి ఫోన్ చేసి చూడాలని ఉంది. ఒక్కసారి రావాలంటూ అభ్యర్థించాడు. నిజమని నమ్మిన మాధవి భర్తతో కలిసి ఎర్రగడ్డకు చేరుకున్న ఇద్దరిపై దాడి చేసి పారిపోయాడు. నిందితున్ని బీఎస్ మక్తాలో అదుపులోనికి తీసుకున్నారు. దాడికి పాల్పడ్డ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు.