హైదరాబాద్

కొత్త పరిశ్రమలు తేలేదు - పాత పరిశ్రమలు తెరవలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 19: నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో కొత్త పరిశ్రమలు రాలేదని, నిజాం షుగర్, సిర్పూర్ కాగజ్ పరిశ్రమలు తెరుస్తామని హామీ ఇచ్చి తెరవలేదని, బయ్యారం పాల్వంచలో స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటుకు శ్రమించలేదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీ నుంచి టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక కారణంగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి, కొండా బాలకిష్టారెడ్డి ఫంక్షన్ హాలులో సభ ఏర్పాటు చేశారు. దత్తాత్రేయ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీచడంతో పార్టీ బలహీన పడిందని చెప్పారు. చేసిన వాటిని చెప్పుకోని విధంగా విఫలమయ్యారని విమర్శించారు. ఇంటింటికీ నీరిస్తామని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథతో పాటు కోటి ఎకరాలకు నీరందిస్తామని కేవలం 30 వేల ఎకరాలకే పరిమితం చేసిన మిషన్ కాకతీయలో వైఫల్యం చెందారని పేర్కొన్నారు. భావ స్వారూపత పార్టీతో సీట్ల సర్దుబాటు జరిగే అవకాశముందని వివరించారు. అమిత్ షాను కాంగ్రెస్ నాయకులు మతిభ్రమించిందనడాన్ని ఖండిస్తున్నామని, అసలు మతిభ్రమించింది కాంగ్రెస్ నాయకులకే అని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు బద్దం బాల్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాద రావు, రాష్ట్ర కార్యదర్శి శేరి నర్సింగ్ రావు, సీనియర్ నాయకులు ప్యాట బాల్‌రెడ్డి, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కే.మాధవ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే.శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు జీ.పాండు గౌడ్, రమేష్, లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ ఆర్.సాయికృష్ణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు టీ.సదానంద్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు సుచరిత నరోత్తం రెడ్డి, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు పోకల సతీష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కే.వివేకానంద్ రెడ్డి, సీనియర్ నాయకుడు చౌదరి యాదవరెడ్డి పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సీఎం కేసీఆర్
* షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి
కేశంపేట, సెప్టెంబర్ 19: గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని షాద్‌నగర్ మాజీ శాసన సభ్యులు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కేశంపేట మండలం ఇప్పలపల్లి, దత్తాయపల్లి, కంకరాళ్లతండా, వేముల్‌నర్వ, బోధునంపల్లి గ్రామాలలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. బహిరంగ సభలో ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దళిత, గిరిజనులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఎక్కడ కూడా అమలు కాలేదని ఆరోపించారు. మిషన్ భగీరథ పథకం పైపులైన్ వస్తున్న కమీషన్‌తో కోట్లు కూడబెడుతున్నారని ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్ రెడ్డి, జడ్పీటీసీ పల్లె నర్సింగ్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాదయ్య, సింగిల్ విండో చైర్మన్ శంకర్, మాజీ సర్పంచ్ శ్రీ్ధర్ రెడ్డి, వీరేశం, పల్లాటి కృష్ణయ్య, చంద్రయ్య, కిషన్ మనోహర్ పాల్గొన్నారు.