హైదరాబాద్

విఘ్నేషుని దర్శనంతో సుఖశాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 19: గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖంగా ఉండాలని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని శివరాంపల్లి ఆటోస్టాండ్ ఏ-బ్లాక్, రాంచరణ్ ఆయిల్ మిల్, బృందావన్‌కాలనీ, సాయిబాబానగర్‌లోని వినాయక మండపాల వద్ద కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన వేడుకల్లో కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని అన్నదానం వడ్డించారు. జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గణనాథుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకొని ఐక్యత చాటాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు టీ.ప్రకాష్ గౌడ్ అన్నారు. బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి, మధుబన్‌కాలనీ, లక్ష్మిగూడ, పద్మశాలిపురం, ఆప్కోకాలనీ, శాంతినగర్, దుర్గానగర్ తదితర బస్తీల్లో గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కుషాయిగూడ: గణేష్ నవరాత్రుల్లో విఘ్నేషునికి పూజలు చేయడంతో సుఖశాంతులు కలుగుతాయని మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ భవానీనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రభాకర్, కొత్త రామారావు, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరాజు, మహిపాల్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేసారు.
మేడ్చల్: మేడ్చల్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొల్పిన వినాయక మండపాల వద్ద భక్తులు గణేశుడికి భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించి తరిస్తున్నారు. ఘణపూర్ గ్రామంతో పాటు పలుచోట్లా మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కీసర: విఘ్నేశ్వరుని కరుణా, కటాక్షం అందరిపైనా ఉండాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నక్క ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం కీసర మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. చీర్యాల గ్రామంలోని శ్రీలక్ష్మీనృసింహ స్వామి, కీసరగుట్ట ఆలయాల్లో పూజలు చేశారు. ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశ పట్టిన సంక్షేమ పధకాలే తిరిగి కేసీఆర్‌ను అధికారంలోకి తీసుకొస్తుందని జ్యోస్యం పలికారు.
జీడిమెట్ల: మతసామరస్యాలకు ప్రతీకలుగా పండుగలను జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ సంజయ్‌పురి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో, గాజులరామారం డివిజన్ ఎన్‌టీఆర్ నగర్‌లో నెలకొల్పిన గణేశ్ మండపంలో ఎమ్మెల్సీ రాజు, వివేక్ ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్‌లు జగన్, సత్యనారాయణ, పాల్గొన్నారు. జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్ నగర్ ఫేజ్- 1లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత కేఎం ప్రతాప్ విచ్చేసి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
షాద్‌నగర్: వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని నెలకొల్పిన విఘ్నేశ్వరుడికి కాంగ్రెస్ నేత ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో శ్రీమిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి కాంగ్రెస్ నాయకుడు చాకలి లక్ష్మయ్య ఆర్థిక సహాయంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జగదీశ్వర్, ఎంపీటీసీ స్వప్న, యాదయ్య, కొత్తూరు ఎంపీపీ శివశంకర్ గౌడ్, కేశంపేట జడ్పీటీసీ పల్లె నర్సింగ్‌రావు, నాయకులు శ్రీనివాస్ యాదవ్, కట్ట వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. శ్రామిక గణేష్ మండల్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశుడికి మున్సిపల్ వైస్ చైర్మన్ వన్నాడ లావణ్య ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు చేసి, గణేష్ మండల్ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకాష్ గౌడ్, శ్రామిక గణేష్ మండల్ అధ్యక్షులు వెంకటేశ్వర రావు, కార్మిక సంఘం అధ్యక్షుడు పినపాక ప్రభాకర్, వెంకట్‌రావు, ముత్తు, అచ్యుత్‌రావు, వేణుగోపాల్ నాయుడు, దేముళ్లు, అప్పన్న, వెంకటేష్ గౌడ్, వార్డు కౌన్సిలర్ యుగంధర్ పాల్గొన్నారు.
కొత్తూరు: ఆదిత్య యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జె.సుదర్శన్ గౌడ్ ప్రారంభించారు. ఎంపీటీసీ మాదారం అనురాధ కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ఎర్రవల్లి నాగరాజు చారి, విష్ణుమూర్తి, గోపాల్, యూత్ సభ్యుడు సోమ్ల నాయక్ పాల్గొన్నారు.
హయత్‌నగర్: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చంపాపేట్, లింగోజిగూడ, హయత్‌నగర్‌లో వినాయకుడికి భక్తులు నిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా చంపాపేట్ డివిజన్ పరిధిలోని మాధవనగర్, దుర్గానగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కృష్ణమాచారి, మల్లేష్‌గౌడ్, మాదవనగర్ కాలనీ అధ్యక్షుడు మణిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
నార్సింగి: గణేష్ నవరాత్రులు పురస్కరించుకుని పలు గణేష్ మండపాలలో నేతలు పూజలు నిర్వహిస్తున్నారు. లంగర్‌హౌస్ గొల్లబస్తీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో బీజేపీ నాయకులు అమర్‌సింగ్ పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రులలో ప్రతిరోజు ఆ గణానాథునికి ప్రత్యేక పూజలు, అన్నాదానం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్రసేనా రెడ్డి, వినేష్‌సింగ్ పాల్గొన్నారు.
భక్తులను ఆకర్శిస్తున్న చేనేత హైండ్లూం విఘ్నేశ్వరుడు
ఉప్పల్: ఉప్పల్ బీరప్పగడ్డలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఫ్రెండ్స్ అసోసియేషన్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి హైండ్లూం వినాయకుడిని తయారు చేశారు. మండపంలో మగ్గం నేసే యంత్రంను ఏర్పాటు చేసి చేనేతతో నేయించిన చీరలతో అలంకరించారు. ప్రత్యేక అలంకరణల మధ్య కొలువైన లంబోదరుడిని చూసేందుకు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండటంతో ఈ ప్రాంతం సందడిగా మారింది. చేనేత వస్త్రాలతో కొలువుదీరిన మండపాన్ని సందర్శిస్తామని ఆపదర్మ మంత్రి కేటీఆర్, ఎంపీలు కవిత, మల్లారెడ్డి ట్విట్టర్‌లో పెట్టినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. శనివారం నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో 108 మొక్కలతో విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేసి పంచనున్నట్లు మండప నిర్వాహకులు శ్రీ గిరి విద్యాచారి, చంద్రశేఖర్, అనూప్‌చారి, రోహిత్, రాహుల్, అరవింద్, అనీల్, సాయి తెలిపారు.