హైదరాబాద్

రైల్వే మహిళా పోలీస్ దళాల కవాతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: సికింద్రాబాద్ వౌలాలిలో శుక్రవారం జరిగిన రైల్వే రక్షక దళం 34వ స్థాపకోత్సవంలో మహిళా పోలీసు దళాల కవాతు ఆకట్టుకుంది. ఆర్‌ఫీఎఫ్‌కు భారత సాయుధ దళాల హోదా దక్కిన రోజు నుంచి ప్రతిఏటా 1985 సెప్టెంబర్ 20వ తేదీని గుర్తు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రైల్వే ప్రిన్సిపల్ ప్రధాన సెక్యూరిటీ కమిషనర్ సంజయ్ సాంకృత్యాయన్ ఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్‌పీఎఫ్ మహిళా పోలీస్ దళాల కవాతును ఆయన అభినందించారు. మహిళా పోలీసుల సాహసాన్ని, అంకితభావం, సంకల్పబలాన్ని ఆయన కొనియాడారు.
విధి నిర్వహణలో మహిళా పోలీసులు సున్నితంగా నిజాయితీగా పని చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఆర్‌పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ ఎఎస్ సిన్హా మహిళా పోలీసు కవాతుకు హాజరైన అతిథులకు స్వాగతం పలికారు. ఈ కవాతులో శిక్షణ పొందిన 126 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధాన సెక్యూరిటీ కమిషనర్ జిఎం ఈశ్వరరావుతో పాటు రైల్వే సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.