హైదరాబాద్

నేడు కరెంటు ఉండని ప్రాంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన నగరంలోని పలు సబ్ స్టేషన్ల పరిధుల్లో కండక్టర్, ఇంటర్ పోల్స్ ఎరక్షన్స్ పనుల కారణంగా ఈ నెల 23న ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్లు సికిందరాబాద్ సిటీ-5 సీబీడీ విద్యుత్ అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా బాపూబాగ్ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు కృష్ణానగర్, సిద్దివినాయక, పీజీరోడ్డు, ఫుట్‌వరల్డ్, మారుతీ కన్‌స్ట్రక్షన్, పోచంపల్లి,సిందీకాలనీ, ఏయిర్‌లైన్స్ టవర్, పీజీరోడ్డు, సయ్యద్ అబ్దుల్లా ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
కృష్ణానగర్ ఫీడర్ 11కేవీ పరిధిలో కృష్ణానగర్, బాపూబాగ్, ఫుడ్ వరల్డ్, గ్రీన్‌గేట్, ప్రశాంత్ అపార్ట్‌మెంట్, హరినివాస్, హనుమాన్ టెంపుల్ ప్రాంల్లో ఉదయం పదిన్నర గంటల నుంచి పనె్నండు గంటల వరకు, అలాగే మడ్‌ఫోర్టు 11కేవీ ఫీడర్ పరిధిలోని పనుల కారణంగా మడ్‌ఫోర్టు, కంటోనె్మంట్, డ్రైవర్స్ క్వార్టర్స్, డైమండ్ పాయింట్ ఏరియా, పోచమ్మ టెంపుల్, ఫిరోజ్ కేఫ్ ఏరియా, ఆహబ్ నగర్ ప్రాంతాల్లో ఉదయం పదకొండు నుంచి పనె్నండు గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విక్రమ్‌పురిలోని 11కేవీ పరిధిలో కూడా జరిగే కండక్టర్, ఇంటర్ పోల్ పనుల కారణంగా విక్రమ్‌పురి కాలనీ, వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్, అహుజ డెంటల్ క్లీనిక్, అక్షిత బిర్యానీ హౌజ్, అయేషా ప్రైమరీ స్కూల్ ఏరియాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

యువ డిజైనర్లకు ప్రోత్సాహం
ఖైరతాబాద్, సెప్టెంబర్ 22: యువ డిజైనర్లను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్లను నిర్వహించడం సంతోషకరమని వర్ధమాన తార కృతిక సింగ్ రాథోడ్ అన్నారు. శనివారం బంజారాహిల్స్‌లో అక్టోబర్ 1, 2 తేదీల్లో తాజ్‌కృష్ణలో కొలువుదీరనున్న జలక్ ఎగ్జిబిషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉత్పత్తిదారులు రూపొందించిన వస్తువులను నేరుగా విక్రయించుకునే అవకాశం ఎగ్జిబిషన్లతో లభిస్తోందని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా విక్రయాలు జరపడంతో ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందనానరు. రెండు రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువ డిజైనర్లు రూపొందించిన వస్త్రాలను అందుబాటులో ఉంచుతున్నట్టు నిర్వాహకుడు నిహార్ తెలిపారు. అనంతరం మోడల్స్ ప్రదర్శన నిర్వహించారు.

కేజీ టూ పీజీ విద్య ఎక్కడ..?
షాద్‌నగర్, సెప్టెంబర్ 22: సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని కేజీ టూ పీజీ జాక్ రాష్ట్ర అధ్యక్షుడు రమాణా రెడ్డి ఆరోపించారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని ఠాగూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యాసంస్థల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ, సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో టీపీజేఎంఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సతీష్ పాల్గొన్నారు.